Nuh rioters: అరెస్ట్‌లకు భయపడి ఆరావళి కొండల్లో...

హరియాణలోని అల్లర్లతో అట్టుడుకుతున్న నుహ్ (Nuh rioters)లో గ్రామస్థులు భయాందోళనల మధ్య బతుకుతున్నారు. పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం ఓవైపు... మళ్లీ అల్లర్లు చెలరేగుతాయేమో అన్న ఆందోళనలతో మరోవైపు తమ స్వస్థలాలను వీడుతున్నారు. ఇళ్లను ఖాళీ చేసి ఆరావళి కొండల్లో( Aravalli Hills ) ఆశ్రయం పొందుతున్నారు. సామూహిక అరెస్టులకు భయపడి(fearing mass arrests) ఇలా ఆరావళి పర్వతాల్లో తలదాచుకుంటున్నారు. నుహ్‌లో అల్లర్లకు కారణంగా భావిస్తున్న వారు(suspected rioters) కూడా ఇందులో ఉన్నారు. అరెస్ట్‌ల భయంతో ఊరు ఊరంతా ఖాళీ అయిపోయింది. తేలికైన మడత పడకలు, టార్పాలిన్ షీట్‌లతో కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
నుహ్ జిల్లా(Nuh district)లోని చాలా గ్రామాలకు చెందిన ప్రజలు అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఈ కొండల్లో ఉంటున్నారు. తమను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఇలా కొండలపైకి వచ్చేశామని అక్కడున్న వారు చెబుతున్నారు. పోలీసులకు భయపడి పర్వతాల్లో తలదాచుకుంటున్నామని, అల్లర్లలో మీ ప్రమేయం ఉందా లేదా అని అడగకుండానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆరావళి పర్వతాల్లో ఉంటున్నవారు చెబుతున్నారు.
అల్లర్లకు పాల్పడిన వారు కూడా ఆశ్రయం కోరుతూ గ్రామస్థులలో కలిసిపోయారని కొండల్లో కఠిన వాతావరణం మధ్య ఉంటున్నవారు చెబుతున్నారు. అల్లర్లలో పాల్గొన్న వారు, పాల్గొనని వారు ఇక్కడ ఉన్నారని ఓ స్థానికుడు తెలిపాడు. అనేక మంది స్థానికులు ఈ కొండల నుంచి కిందకు దిగి ఆయుధాలు, రాళ్లు, కర్రలతో ఓ ప్రార్థనా మందిరంపై దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి జరిగిన రోజు తుపాకీ కాల్పుల శబ్ధం కూడా వచ్చిందని ఓ స్థానికుడు తెలిపారు.
ఆరావళి పర్వతాల్లో ఇప్పుడు 500 మంది పురుషులు ఉన్నారు. వారు పట్టుబడకుండా తప్పించుకోవడానికి కొండపై నుంచి ఎప్పుడూ పోలీసు వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పర్వతాల పైనుంచే తాము పోలీసు వాహనాలను గుర్తిస్తామని, వస్తే వెంటనే ఇక్కడి నుంచి పారిపోతామని తెలిపారు. సాధారణంగా ఉంటాయి. తమ గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అల్లర్లు, దోపిడీలకు పాల్పడ్డారని , అనంతరం వారందరూ కొండల్లో ఉంటూ తప్పించుకు తిరుగుతున్నారని డౌన్‌హిల్ సర్పంచ్ రఫీక్ తెలిపారు. తమ గ్రామం నుంచి ఏడుగురు అల్లర్లలో పాల్గొన్నారని, వారిని పోలీసులకు అప్పగిస్తానని తెలిపారు. రాజస్థాన్, నుహ్ జిల్లా కేంద్రం నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చి అల్లర్లకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షి ఇర్ఫాన్ తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com