Nuh Violence: బుల్లెట్ దింపి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Nuh Violence: బుల్లెట్ దింపి  నిందితుడిని అదుపులోకి తీసుకున్న  పోలీసులు
చాకచక్యంగా తెల్లవారుజామున నిందితుడికి బేడీలు వేసిన పోలీసులు ...

హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల నిందితుల్లో మరొకడిని ఎట్టకేలకు పోలీసుఐ అదుపులోకి తీసుకున్నారు. తన కోసం గాలిస్తున్న పోలీసులను చూసిన నిందితుడు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో పోలీసులు అతడి కాలిపై కాల్చఐడంతో కదల్లేక అక్కడిక్కడ కుప్పకూలాడు. తక్షణం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. జిల్లాలోని తౌరు ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందీ . నిందితుడిని వాసింగా గుర్తించారు. అతడి తలపై రూ. 25 వేల రివార్డు కూడా ఉంది. హత్య, లూటీ సహా నిందితునిపై పలు కేసులు ఉన్నాయి.నిందితుడి కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతనిని నల్‌హాద్ మెడికల్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతడి నుంచి దేశీయ తుపాకి, ఐదు కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.


గత నెలలో హరియాణాలోని నూహ్‌లో వీహెచ్‌పీ కార్యకర్తలు చేపట్టిన జలాభిషేకం యాత్ర రణరంగంగా మారింది. ఆ ర్యాలీ నంద్‌ గ్రామానికి చేరుకోగా కొందరు వ్యక్తులు ర్యాలీపైకి రాళ్లు రువ్వారు. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పలు వాహనాలకు నిప్పట్టించారు. స్పందించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. రెచ్చగొట్టే ప్రసంగాలే ఈ అల్లర్లకు కారణమని నిర్ధారించారు. అప్పటికప్పుడు పలువుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరి కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. అల్లరి మూకలు ఓ హోటల్‌ను అడ్డాగా చేసుకుని రాళ్లు రువ్వినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ హోటల్‌ను పోలీసులు కూల్చివేశారు. మరోవైపు, నుహ్‌లో మొదలైన అల్లర్లు క్రమంగా పొరుగున్న ఉన్న గురుగ్రామ్‌కు కూడా పాకాయి. ఈ ఘర్షణలో ఇద్దరు హోంగార్డులతోసహా ఆరుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 100మందికిపైగా నిందితులను అరెస్ట్ చేశారు.

వారం రోజుల క్రితం ఇదే కేసులో బజరంగ్‌దళ్‌కు చెందిన గో రక్షకుడు బిట్టూ బజరంగీని పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టూ బజరంగీతోపాటు బజరంగ్‌దళ్ కార్యకర్త మోను మనేసర్ చేసిన కామెంట్ల కారణంగానే మతకలహాలు చెలరేగినట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు జరిగిన 20 రోజుల తర్వాత ఫరీదాబాద్ సమీపంలో అతడిని అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story