Nuh Violence: హరియాణలో చెలరేగిన హింస

హరియాణ(Haryana )లోని నూహ్ జిల్లా(Nuh Violence)లో చెలరేగిన మతపరమైన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు మృతి( Two dead) చెందారు. రాళ్లు రువ్వుకున్న ఘటనల్లో 10 మంది పోలీసులు( 10 cops injured) సహా 15 మంది గాయపడ్డారు(injured ). ఒక DSP తలలోకి మరో ఇన్‌స్పెక్టర్ కడుపులోకి తూటాలు దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. తమ వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో మరో వర్గం దాడులు( two groups) చేసిందన్న వార్త రాగానే కొందరు ఆకతాయిలు గురుగ్రామ్ జిల్లా సోహ్నాలో 4 వాహనాలు, దుకాణానికి నిప్పు పెట్టారు. పెద్దఎత్తున 2 వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఓ వీడియో ఈ ఘర్షణలకు కారణమని తెలిసింది. ప్రార్థనా మందిరంలో తల దాచుకున్న 2వేల 500 మందిని పోలీసులు ఖాళీ చేయించారు. ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వదంతులు వ్యాప్తి కాకుండా ఉండేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు అంతర్జాల సేవలపై నిషేధం విధించారు.
20 కంపెనీల(20 companies ) CAPF బలగాలను హరియాణాకు తరలిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ( Central government) తెలిపింది. హర్యానా (Haryana)లోని నుహ్ (Nuh)లో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో కేంద్రం అప్రమత్తమైంది. అల్లర్లను అదుపు చేసేందుకు పారామిలటరీ బలగాలను హుటాహుటిన రంగంలోకి దింపింది. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను(suspended internet services ) నిలిపివేశారు. తక్షణం 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.
అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయానికి ఆదేశాలిచ్చామని హరియాణ హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. కాగా, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి అలజడలకు తావీయవద్దని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్(Chief Minister M L Khattar ) కోరారు. హర్యానాలో శాంతి సామరస్యాన్ని కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దోషులను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశ సమగ్రత, శాంతి కోసం మనమందరం కలిసి పని చేస్తూనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ప్రజలకు పిలుపునిచ్చారు. శాంతి, సోదరభావాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నుహ్ అఫ్తాబ్ అహ్మద్ కూడా మత సామరస్యాని కాపాడాలని స్థానికులకు సూచించారు. సోషల్ మీడియాలో అల్లర్లను రెచ్చగొట్టేలా పోస్ట్‌లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గురుగ్రామ్ డిప్యూటీ కమీషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com