Nupur Sharma : నాపై అరెస్టులను ఆపండి.. నాకు ప్రాణ హాని ఉంది : నుపుర్ శర్మ

Nupur Sharma : వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ...మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు. నుపూర్ శర్మపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. తన జీవితం ప్రమాదంలో పడింది..హత్య, అత్యాచారం బెదిరింపులు వస్తున్నాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో నుపూర్ శర్మ పేర్కొన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున దేశంలో వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని పిటిషన్‌లో కోరారు.
ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో భాగంగా నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలోనే గాక, అంతర్జాతీయంగానూ తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆమెపై దేశంలో వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులన్నింటిని ఢిల్లీకి బదిలీ చేయాలంటూ గతంలోనూ సుప్రీంను ఆశ్రయించారు నుపూర్ శర్మ. ఐతే విచారణ టైంలో నుపూర్ శర్మపై తీవ్ర స్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com