Odisha: యూట్యూబ్ వీడియో కోసం రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు..

ఒడిశాలోని పూరీలో రైల్వే ట్రాక్‌పై రీల్ చిత్రీకరిస్తున్న 15 ఏళ్ల బాలుడు రైలు ఢీకొని మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం జనక్‌దేవ్ పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. మంగళఘాట్ నివాసి విశ్వజీత్ సాహు తన తల్లితో కలిసి దక్షిణకాళి ఆలయాన్ని సందర్శించాడు.
ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు, అతను సోషల్ మీడియా కోసం ఒక చిన్న వీడియో రికార్డ్ చేయడానికి రైల్వే పట్టాల దగ్గర ఆగాడు. ఈ సంఘటనకు సంబంధించిన మొబైల్ వీడియో ఫుటేజీలో సాహు అవతలి వైపు నుండి రైలు వస్తున్నట్లు రికార్డ్ చేసుకున్నట్లు కనిపించింది. రైలు నుండి వచ్చిన గాలి ఫోన్‌ను నేలపై పడేసింది. దానిని తీసుకోబోయి అతడు ముందుకు వంగడంతో ట్రాక్ మీద పడిపోయాడు. రైలు అతడి మీద నుంచి వెళ్లింది. ఒడిశా రైల్వే పోలీసులు (GRP) సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టులో, గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ ఒడిశాలోని కోరాపుట్‌లోని డుడుమా జలపాతం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా కొట్టుకుపోయాడు. సాగర్ టుడు తన స్నేహితుడు అభిజిత్ బెహెరాతో కలిసి డ్రోన్ కెమెరాను ఉపయోగించి తన యూట్యూబ్ ఛానెల్ కోసం స్థానిక పర్యాటక ప్రదేశాల వీడియోలను రికార్డ్ చేయడానికి ఆ ప్రాంతాన్ని సందర్శించాడు.
భారీ వర్షపాతం కారణంగా మచకుండ ఆనకట్ట వద్ద అధికారులు నీటిని విడుదల చేయడంతో జలపాతం అకస్మాత్తుగా ఉప్పొంగింది. రాతిపై నిలబడి ఉన్న సాగర్ సమతుల్యతను కోల్పోయి బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించడానికి పర్యాటకులు, స్థానికులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మచ్చకుండ పోలీసులు, అగ్నిమాపక దళ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి, కానీ అతని ఆచూకీ లభించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com