Jharkhand: ఝార్ఘండ్‌లో ఘోర ప్రమాదం.. రోప్‌వే లో చిక్కుకున్న పర్యాటకులు.. ఇద్దరు మృతి..

Jharkhand: ఝార్ఘండ్‌లో ఘోర ప్రమాదం.. రోప్‌వే లో చిక్కుకున్న పర్యాటకులు.. ఇద్దరు మృతి..
Jharkhand: ఝార్ఘండ్‌లోని బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వచ్చే చాలామంది ఈ త్రికూట పర్వతాల రోప్ వేలో ప్రయాణించడానికి వస్తూ ఉంటారు

Jharkhand: రోప్ వే అనేది భారతదేశంలోని చాలావరకు పర్యాటక ప్రాంతాల్లో ఉంది. అందులో ఒకటి ఝార్ఘండ్‌లోని దేవ్‌ధర్ జిల్లాలో త్రికూట పర్వతాల్లో ఉన్న రోప్‌ వే. ఇండియాలో అతిపెద్ద వర్టికల్ రోప్ వేనే ఈ త్రికూట పర్వాతాల రోప్ వే. అయితే ఈ రోప్ వేలో ప్రమాదం జరగడం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికీ దాదాపు 50 మంది ఆ రేప్ వే క్యాబిన్‌లలో చిక్కుకుపోయి ఉన్నారని సమాచారం.

ఝార్ఘండ్‌లోని బైద్యనాథ్ ఆలయ సందర్శనకు వచ్చే చాలామంది ఈ త్రికూట పర్వతాల రోప్ వేలో ప్రయాణించడానికి వస్తూ ఉంటారు. అలాగే పండగ రోజు ఎంతోమంది పర్యాటకులు ఆ ఆలయాన్ని సందర్శించుకున్న తర్వాత ఈ రోప్ వే దగ్గరకు వచ్చారు. అదే సమయంలో ఇక్కడ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 50 మంది ఆ కేబుల్ కార్లలో చిక్కుకుపోయి ఉన్నారు.

ప్రమాదం జరిగి 19 గంటలు అవుతున్నా.. ఇంకా ఆ 50 మందిని సురక్షితంగా బయటికి తీసుకొని రావడానికి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొందరినీ సురక్షితంగా క్యాబిన్‌లలో నుండి బయటికి తీయగలమని అక్కడి అధికారులు చెప్తున్నారు. అంతే కాకుండా ఈ ఘటనపై వ్యాపిస్తున్న వదంతులను నమ్మొద్దని అధికారులు కోరారు.

Tags

Next Story