మహిళలను నగ్నంగా చూడొచ్చని మ్యాజిక్ మిర్రర్ కొన్న వృద్ధుడు.. తర్వాత ఏం జరిగిందంటే..

మహిళలను నగ్నంగా చూడొచ్చని మ్యాజిక్ మిర్రర్ కొన్న వృద్ధుడు.. తర్వాత ఏం జరిగిందంటే..
మహిళలను నగ్నంగా చూడాలనుకునే 72 ఏళ్ల వృద్ధుడు మాయా అద్దం అని ప్రచారం చేసిన వస్తువును రూ. 9 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు.

ముదిమి వయసులోనూ మారని ఆలోచనలు.. తీరని కోరికలు..మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాల్సిన వయసులో ఆడవాళ్ల అందాలను చూడాలనుకున్నాడు.. అందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధపడ్డాడు ఒడిస్సాకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు. అతని బలహీనతను ఆసరాగా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నారు కేటుగాళ్లు.

మా దగ్గర ఓ మాయా అద్దం ఉంది.. అది మహిమలెన్నింటినో చూపెడుతుంది. నువ్వు చూడాలనుకుంటున్న ఆ అందాలను కూడా ఇందులో నుంచి చూసేయొచ్చు అని చెప్పారు.. దాంతో మస్తు ఖుషీ అయిపోయాడు.. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. వెనుకా ముందు ఆలోచించకుండా వస్తువు ఖరీదు రూ.౨ లక్షలు అని చెబితే తన దగ్గర రూ.9 లక్షలే ఉన్నాయని చెప్పి వారికి ఇచ్చాడు. దాంతో కేటుగాళ్లు చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని భావించి ఆ 9 లక్షలు తీసుకుని మ్యాజిక్ మిర్రర్ ముసలాయన చేతిలో పెట్టి మాయం అయ్యారు.

ఆ తర్వాత జరిగిన ఘటనే విషాదానికి కారణమైంది. అవినాష్ కుమార్ శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందినవారు. 72 ఏళ్ల వయసులో యువతుల పట్ల ఆసక్తి చూపుతున్నాడు. అతడి బలహీనత గురించి తెలిసిన వ్యక్తులు అతడిని మోసం చేసి భారీగా డబ్బులు దండుకోవాలని ప్లాన్ చేశారు. దీంతో వారు సింగపూర్‌లోని ఓ ప్రసిద్ధ పురాతన వస్తువుల నిల్వ కంపెనీలో ఉద్యోగులమని పేర్కొంటూ శుక్లాను సంప్రదించారు.

నాసా వాడే మ్యాజిక్ మిర్రర్ తమ వద్ద ఉందని చెప్పి అతడిని ఒప్పించారు. ఈ అద్దం ద్వారా మహిళలను నగ్నంగా చూడవచ్చని, భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని వారు వృద్ధుడిని నమ్మించారు. మ్యాజిక్ మిర్రర్ ధర రూ. 2 కోట్లు. ఒక్కరే అంత మొత్తం చెల్లించలేకపోతే ఎవరి సహాయం అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. దాంతో శుక్లా వాళ్లకీ వీళ్లకి ఆ మ్యాజిక్ మిర్రర్ గురించి చెప్పి తన వాటాగా రూ. 9 లక్షల వరకు ఇచ్చాడు.

వన్ ఫైన్ డే మ్యాజిక్ మిర్రర్ శుక్లా చేతిలో పెట్టి మాయమయ్యారు కేటుగాళ్లు. రోజులు గడిచేకొద్దీ శుక్లాకు ఆ అద్దంలో తన మొహం తప్ప మరెవరూ కనిపించట్లేదు. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్నాడు. దాంతో శుక్లా పోలీసులను ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పార్థ సింహరాయ్, మొలయా సర్కార్, సుదీప్త సింహరాయ్ అవినాష్ కుమార్ శుక్లాను బెదిరించినట్లు పోలీసులు జరిపిన విచారణలో తేలింది. ఇలాగే మరికొందరిని మోసం చేసి డబ్బులు స్వాహా చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి 5 మొబైల్ ఫోన్లు, కారు, రూ. 28 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story