OLX లేఆఫ్స్..800 మందికి గుడ్ బై

OLX  లేఆఫ్స్..800 మందికి గుడ్ బై
వ్యయ నియంత్రణా చర్యలలో భాగమే కోత

ఓఎల్ఎక్స్ సంస్థ లేఆఫ్స్ ను ప్ర‌క‌టించింది. ఓఎల్ఎక్స్ ఆటోస్ కొన్ని ప్రాంతాల్లో ఒడిదుడుకుల‌తో నడు నడుస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.

ఆర్ధిక వాతావ‌ర‌ణం ప్ర‌తికూలంగా మార‌డంతో ఈ ఏడాది ఓఎల్ఎక్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1500 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తుంద‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అనుకున్నట్టు గానే ముందు గా 800 మందిని తొలగిస్తున్నట్టు కొత్త లేఆఫ్స్ నిర్ణయం వెలువడింది. తాము కంపెనీ నుండి వైదొలిగామని ఓఎల్ఎక్స్ ఆటోమెక్సికో ఉద్యోగులు ఇప్పటికే లింక్డిన్ లో పోస్ట్ చేసినట్లుగా సమాచారం. అయితే ఉద్యోగాలు కోల్పోయే వారికి అవసరమైన సాయమందిస్తామని ఓఎల్ఎక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే టాప్ లెవల్ ఉద్యోగులపై పై లేఆఫ్స్ ప్రభావం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అనిశ్చిత ఆర్థిక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని మార్కెట్ల నుండి ఓఎల్ఎక్స్ ఆటోస్ నిష్క్రమించడం మేలని కంపెనీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సరైన ఇన్వెస్ట‌ర్లు కొర‌వ‌డ‌టంతో అర్జెంటీనా, మెక్సికో, కొలంబియా మార్కెట్ల‌లో ఒఎల్ఎక్స్ ఆటోస్‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కంపెనీ ప్ర‌తినిధులు వెల్లడించారు. ఓఎల్ఎక్స్ ఆటో ఇండియా వెబ్‌సైట్ కొనసాగుతోంది. ఓఎల్ఎక్స్ గ్రూప్‌లో ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 11,375 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నట్లు వారి వార్షిక నివేదిక‌లో తెలిపారు. ఉద్యోగాల తొలగింపు విషయాన్ని ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్‌ టెక్ క్రంచ్‌ వార్తా సంస్థకు ధ్రువీకరించింది. ఆమ్‌స్టర్‌డామ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంగా కంపెనీ ఇటీవలే ఉద్యోగాల కోత గురించి బాధిత ఉద్యోగులకు తెలియజేయడం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఓఎల్‌ఎక్స్‌ గ్రూప్ 2009లో భారత్ లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మే వేదికగా చాలా తక్కువ కాలంలోనే ఎంతో పేరుపొందింది. ఇదే కంపెనీ 2020 జనవరి లో ప్రీ ఒన్డ్ కార్స్ వ్యాపారం మొదలుపెట్టింది.

కేవలం ఓఎల్ఎక్స్ గ్రూప్ మాత్రమే కాదు కుండా ప్రపంచంలోనే అత్యంత పెద్ద కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలతో పాటు దేశంలోని ప్రముఖ స్టార్ట్ అప్ కంపెనీలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. నష్టాల్లో కొనసాగుతున్న డిపార్ట్మెంట్ లకు చెందిన ఉద్యోగులపైనే ఈ తొలగింపు ప్రభావం ఎక్కువగా పడుతుంది.

Tags

Read MoreRead Less
Next Story