One Nation One Election: మరోసారి తెరపైకి ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశం..

One Nation One Election: ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడంపై అధ్యయనం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. లోక్‌సభ, రాష్ట్రాల ఎన్నికలను ఒకేసారి జరిపేందుకు ఉన్న అవకాశాలపై.. లా కమిషన్ అధ్యయనం చేస్తోందన్నారు. ఇప్పటికే పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్, పార్లమెంటరీ స్ధాయి సంఘం పరిశీలన జరిపిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం సహా భాగస్వామ్య పక్షాలందరితో సంప్రదింపులు జరిపిందని కేంద్రం స్పష్టం చేసింది. ఒకదేశం, ఒక ఎన్నికపై స్థాయి సంఘం 79వ నివేదికలో పలు సిఫార్సులు చేసిందన్నారు. ప్రస్తుతం ఈ అంశంపై న్యాయ కమిషన్ అధ్యయనం చేస్తోందని.. రోడ్ మ్యాప్, విధాన రూపకల్పనపై లా కమిషన్ పరిశీలన చేస్తోందని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఎంపీ సుశీల్‌కుమార్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com