Operation Ajay: ఇజ్రాయెల్ ఢిల్లీ వచ్చిన మూడో విమానం

Operation Ajay: ఇజ్రాయెల్  ఢిల్లీ వచ్చిన మూడో విమానం
197 మంది భారతీయులతో...

ఆపరేషన్ అజయ్ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో మూడవ విమానం ఆదివారం నాడు ఢిల్లీలో దిగింది. ఇజ్రాయెల్ దేశం నుంచి తిరిగి వచ్చిన వారికి ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ స్వాగతం పలికారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన భారతీయులందరికీ మంత్రి భారత జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ నుంచి తమను తరలించినందుకు ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేం భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేం అక్కడ భయపడ్డాం. సర్కారు చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’ అని ప్రయాణీకులు పేర్కొన్నారు.

అక్కడ భయంకర పరిస్థితులు నెలకొన్నాయని.. తాము ప్రాణాలపై ఆశ వదిలేసుకున్న టైంలో భారత ప్రభుత్వం తమ రక్షణ కోసం చర్యలు చేపట్టిందని మరో ప్రయాణికుడు అన్నాడు. ఇజ్రాయెల్ - పాలస్థీనా మధ్య ఉద్రిక్తతలు చల్లారేవరకు ఆపరేషన్ అజయ్ కొనసాగించాలని కోరాడు. అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమానంలోని 197 మంది భారతీయులు భారత్ మాతా కీ జై, వందేమాతరం వంటి నినాదాలు చేసిన వీడియోను ట్వీట్ చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడుల తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడానికి ఈ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు.


అక్టోబర్ 11 న 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది భారత ప్రభుత్వం. అక్టోబరు 7న యుద్ధం ప్రారంభమైనందున ఎయిర్ ఇండియా, ఇతర విమానయాన సంస్థలు ఇజ్రాయెల్‌కు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేశారు. దీంతో భారత ప్రభుత్ ఆపరేషన్ అజయ్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కింద ప్రత్యేక చార్టర్డ్ విమానాలు భారతీయులను తిరిగి తీసుకువస్తున్నాయి. MEA కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనాలో పరిస్థితిని పర్యవేక్షించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ రాజధానిలో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ కోసం ఫోన్ నంబర్‌లు: 1800118797 (టోల్ ఫ్రీ), +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905, +919968291988, ఇమెయిల్ ID situation@inmea.gov గా ఉంది. భారత రాయబార కార్యాలయం 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ను - +972-35226748, +972-543278392, ఇమెయిల్ ID cons1.telaviv@mea.gov.in మెయిల్ చేయవచ్చు.


Tags

Read MoreRead Less
Next Story