Delhi Car Blast: ఉగ్ర నెట్‌వర్క్‌కు కర్త.. కర్మ.. క్రియ షాహీనానే

Delhi Car Blast: ఉగ్ర నెట్‌వర్క్‌కు  కర్త.. కర్మ.. క్రియ షాహీనానే
X
ఢిల్లీ బ్లాస్ట్ వెనుక తవ్వేకొద్దీ సంచలన విషయాలు

ఢిల్లీ బ్లాస్ట్ వెనుక తవ్వేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అనేక కీలక విషయాలు రాబట్టిన అధికారులు.. తాజాగా మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. దేశ వ్యా్ప్తంగా అనేక చోట్ల పేలుళ్లు చేసేందుకు డాక్టర్ ఉమర్‌తో కలిసి డాక్టర్ షాహీన్ కుట్ర చేసిందని తేల్చారు. దీనికంతటికి కర్త.. కర్మ.. క్రియ షాహీనానే అని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. జైషే మహ్మద్ ఎరవేసిన మైకంలో పడి షాహీనా పెద్ద కుట్రకు ప్లాన్ చేసినట్లుగా కనుగొన్నారు. ఈ గడ్డపై పుట్టి.. ఈ గడ్డకే ద్రోహం చేయడానికి ప్రణాళికలు రచించింది.

డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ కూల్చివేత వార్షికోత్సవం రోజున దేశ వ్యాప్తంగా శక్తివంతమైన పేలుళ్లకు డాక్టర్ ఉమర్‌తో కలిసి షాహీన్ ప్రణాళిక వేసింది. అయితే డాక్టర్ ముజమ్మిల్‌ అరెస్ట్ తర్వాత అందరిలోనూ భయాందోళన మొదలైంది. ఈ క్రమంలోనే డాక్టర్ ఉమర్‌ కూడా భయాందోళనకు గురయ్యాడు. నవంబర్ 10న ఉమర్ చాలా ఆందోళనలో ఉన్నట్లు సాక్షులు చెబుతున్నదానిని బట్టి అర్థమవుతోంది. ఇక క్రమంలోనే కారులో సరిగ్గా అమర్చబడని ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు నవంబర్ 10న పేలాల్సింది కాదు.. డిసెంబర్ 6న పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో కారు బ్లాస్ట్‌లకు షాహీన్ స్కెచ్‌లు వేసింది. కానీ పాపం పండి ఇంత పెద్ద ద్రోహం బయటపడింది. లేదంటే దేశంలో ఎంతో మంది మారణహోమంలో బలైపోయే వారు.

ఇక ఉగ్ర బృందం మధ్య జరిగిన సంభాషణకు చెందిన కోడ్‌భాష వెలుగు చూసింది. ‘‘ఆపరేషన్ D-6’’ అనే కోడ్‌నేమ్ ఉపయోగించారు. ఉగ్రవాదుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డైరీల్లో కూడా ఇదే ఉంది. ఈ ఆపరేషన్‌కు షాహీనే సర్జన్‌గా దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆరు నగరాల్లో ఆపరేషన్ D-6కు ప్లాన్ చేసిందని జమ్మూకాశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టైన వారు ఇచ్చిన సమాచరంతో ఈ కుట్ర వెలుగు చూసింది.

ఇక పెద్ద ఎత్తున నగదు తరలింపులు కూడా చేసినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో షాహీన్ ఖాతాలను అధికారులు ఆడిట్ చేస్తున్నారు. ఢిల్లీ, కాన్పుర్‌, లక్నోలో ఉన్న ఏడు బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు.

డిసెంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడులో 13 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. కుట్రకు సంబంధించిన విషయాలను అధికారులు సేకరించే పనిలో ఉన్నారు.

Tags

Next Story