ARMY: నేలరాలిన "సిందూరం"తోనే.. ముష్కరులను లేపేశారు

ARMY: నేలరాలిన సిందూరంతోనే.. ముష్కరులను లేపేశారు
X
ఆపరేషన్ సిందూర్‌తో వణికిన దాయాది... వార్‌ రూమ్‌ నుంచి స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని

భారత్‌లో నెత్తుటేరులు పారించిన ముష్కరులను.. ఇండియన్ ఆర్మీ మట్టిలో కలిపేసింది. సవాల్ విసిరిన ఉగ్రమూకల ప్రాంతాలను.. స్మశానంలా మార్చేసింది. నవ వధువుల సింధూరాన్ని తుడిపేసిన టెర్రరిస్టులను.. ఆపరేషన్ సింధూర్‌తో మట్టుబెట్టింది. ఆధునిక భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రపంచానికి రీ సౌండ్ వచ్చేలా గట్టిగా వినిపించింది. మోదీ సారథ్యం... అజిత్ దోవల్ చాణక్యం.. ఆర్మీ ధైర్యసాహసాలతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారత సైన్యం మట్టిలో కప్పేట్టేసింది. భారత్‌తో పెట్టుకుంటే ఇంట్లో నక్కిన వారిని బయటకు లాక్కొచ్చి మరీ చంపుతామని దాయాదికి చావు దెబ్బ కొట్టి మరీ చెప్పింది. భారత్ అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. వైల్డ్ ఫైర్ అని పాక్‌కు అర్థమయ్యేలా... ఉగ్రవాదులకు బోధపడేలా ఇండియన్ ఆర్మీ గట్టిగా చెప్పింది.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రధానమంత్రి హెచ్చరించినట్లుగానే ఉగ్ర స్థావరాల్లోనే వారికి సమాధి కట్టేశారు. ఉగ్ర స్థావరాల లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. చెప్పి దాడి చేసిన భారత సైన్యం.. ఇండియా ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పింది. దాయాది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... భారత్ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కొద్ది నిమిషాల ముందే ఇండియన్ ఆర్మీ ట్వీట్‌ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట 28 నిమిషాలకు దాడికి సిద్ధం.. గెలుపే లక్ష్యం అంటూ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒంటి గంట 51 నిమిసాలకు ఆపరేషన్‌ ముగిశాక న్యాయం జరిగింది.. జై హింద్ అంటూ ఆర్మీ మరో ట్వీట్‌ చేసింది. ఆపరేషన్ సింధూర్‌ని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు . వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించారు. ఆపరేషన్ సింధూర్ లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

ఎయిర్‌పోర్టుల మూసివేత

అయితే దాడులు ఏయే ప్రాంతాల్లో చేశారనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ వెల్లడించలేదు. మరోవైపు, దాడుల నేపథ్యంలో శ్రీనగర్​, జమ్ము, అమృత్​సర్, ధర్మశాల, లేహ్​ విమానాశ్రయాలు భారత్​ మూసివేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడితో భారత్‌కు సహనం నశించింది. ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక.. మీ ప్రధానికి చెప్పండనడంతో ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకొంది. పఠాన్‌ కోట్‌, రియాసీ దాడి వంటి పెద్ద కుట్రలకు కేంద్రాలుగా నిలిచిన శిబిరాలను నేలమట్టం చేసింది. భారత్‌పై అనేక కుట్రలకు కేంద్రాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను భారత వైమానిక దళం కూల్చేసింది.

Tags

Next Story