Parliament: పార్లమెంట్‌లో మణిపుర్‌ మంటలు

Parliament: పార్లమెంట్‌లో మణిపుర్‌ మంటలు
పార్లమెంట్‌లో కొనసాగుతున్న వాయిదాల పర్వం... ప్రధాని ప్రకటన చేయాలని ఇండియా ఫ్రంట్‌ నేతల పట్టు... పార్లమెంట్‌ ప్రాంగణంలో పోటాపోటీ ప్రదర్శనలు

మణిపుర్‌ ఘటన(Manipur issue)పై విపక్షాల ఆందోళనలతో పార్లమెంటు(Parliament)లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉభయ సభలు( Lok Sabha and Rajya Sabha) ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే మణిపుర్‌ ఘటనపై ప్రధాని‍(Prime Minister Narendra Modi) ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. చర్చకు తాము సిద్ధమేనని కేంద్రం ప్రకటించినప్పటికీ.. చర్చకు ముందే ప్రధాని ప్రకటన చేయాలని(PM's statement) విపక్షాలు పట్టుబడుతూ స్పీకర్‌ వెల్‌లోకి దూసుకొచ్చాయి. ఇండియా ఫర్ మణిపుర్‌, మణిపుర్‌పై ప్రధాని ప్రకటన చేయాలని రాసున్న ప్లకార్డులను ప్రదర్శించాయి. ఈ ఆందోళనలతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.


అంతకుముందు మహిళలను నగ్నంగా ఊరేగించిన అమానవీయ ఘటనపై..ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు( several opposition parties INDIA) పార్లమెంట్‌ ప్రాంగణం(Parliament premises)లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహం ఎదుట కేంద్రానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఇండియా ఫ్రంట్‌ ఎంపీలు ఆందోళన చేశారు.


పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు మణిపుర్‌ అమానుష ఘటనపై సభ బయట ప్రధాని మోదీ ప్రకటన చేయడం సిగ్గు చేటని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. పార్లమెంటులో మణిపూర్ హింసపై సమగ్ర ప్రకటన చేయయడం ప్రధానమంత్రి బాధ్యతని అన్నారు. ప్రధాని మోదీ, భాజపా సర్కార్‌, మణిపుర్‌ ఘటనకు సమాధానం చెప్పకుండా పారిపోలేవని ఖర్గే అన్నారు రూల్ 167 కింద చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని ఎంపీలు తెలిపారు. కానీ మోదీ సర్కార్‌ రూల్ 176 కింద స్వల్పకాలిక చర్చకే మొగ్గు చూపుతోందని విమర్శించారు.

పార్లమెంట్‌ ప్రాంగణంలో భాజపా ఎంపీలు( BJP parliamentarians) కూడా ఆందోళన చేశారు. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. భాజపా మహిళా ఎంపీలు ఈ ఆందోళనలకు నేతృత్వం వహించారు. రాజస్థాన్‌లో శాంతి భద్రతలు పెను ప్రమాదంలో ఉన్నాయని... రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని భాజపా ఎంపీలు నినాదాలు చేశారు. మహిళలపై నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, గహ్లోత్‌ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story