INDIA VS NDA: వ్యూహ ప్రతివ్యూహాల్లో ఇండియా, బీజేపీ

పార్లమెంట్ సమావేశాల్లో తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని విపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు( opposition alliance INDIA) నిర్ణయించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే(Rajya Sabha Mallikarjun Kharge ) ఛాంబర్‌లో సమావేశమైన నేతలు.... మణిపుర్ హింసపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని పట్టుపట్టాలని నిర్ణయించారు. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్( AAP MP Sanjay Singh) సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. రాజ్యసభ నిబంధనలకు విరుద్దంగా వ్యహవరించినందుకు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సంజయ్‌సింగ్‌ను ఛైర్మన్ సస్పెండ్ చేశారు. మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేసినందుకే తనను సస్పెండ్ చేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు.
మరోవైపు... పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి మోదీ( Prime Minister Narendra Modi )... అధ్యక్షతన జరిగిన భేటీలో వర్షాకాల సమావేశాల్లో అనుసరించవలసిన వ్యూహంపై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. భాజపా సంస్థాగత అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కమలం పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపుర్ అంశంపై చర్చకు తాము సిద్ధమేనని, కానీ ప్రతిపక్షాలే ఇందుకు అంగీకరించడం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న లోక్‌సభలో మండిపడిన విషయం తెలిసిందే.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Mansoon Session) ‘మణిపుర్ అల్లర్ల’ అంశం కుదిపేస్తోంది. మణిపుర్ (Manipur Issue)పై ప్రధాని మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల (Opposition Protest) కూటమి పట్టుబట్టడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోవైపు రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడం మరింత దుమారం రేపింది.
మణిపూర్‌లో మెజారిటీ వర్గమైన మైతీలను గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వటంతో మే 3న ఒక్కసారిగా జాతుల ఘర్షణ తలెత్తాయి. హిందువులైన మెజారిటీ మైతీలకు, గిరిజనులైన మైనారిటీ కుకీ, నాగా మరికొన్ని జాతులకు మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. అప్పటి నుంచి ఈ గిరిజనులకు చెందిన చర్చిలను కూల్చేయటం, గ్రామాలను తగులబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. మైతీ వర్గంలోని కొందరు భద్రతా బలగాల వద్ద ఆయుధాలను దొంగిలించి మారణహోమానికి పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా మే 4న దాదాపు వెయ్యిమంది మైతీలు కాంగ్‌పోక్‌పీ జిల్లాలోని బీ ఫైనోమ్ గ్రామంపై దాడిచేశారు. ఇళ్లన్నీ తగులబెట్టారు. భయంతో పారిపోతున్న కుకీలను పట్టుకొని కొట్టి చంపేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com