Nationa Emblem : సింహం సైలెంటుగా ఉండాలంటున్న ప్రతిపక్షాలు..

Nationa Emblem : నూతన పార్లమెంట్‌పై ఆవిష్కరించిన జాతీయ చిహ్నం నమూనాపై వివాదం రాజుకుంది. ప్రధాని ఆవిష్కరించిన చిహ్నంలో ఉగ్రరూపంతో సింహాలు కనిపిస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జాతీయ చిహ్నంలో సింహాలు గర్జిస్తూ కాదు.. చిరునవ్వుతో ఉండాలంటున్నారు.
జాతీయ చిహ్నంలో మార్పులు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని మోదీ సర్కారు తీరుపై విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. సింహం ముఖంలో శాంతానికి బదులు రౌద్రం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ యాక్ట్ కింద చిహ్నాల్లో మార్పులు కుదరదని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ఇప్పటికే పార్లమెంట్‌పై ప్రధాని జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడంపై రాజకీయ దుమారం రేపుతోంది. చట్టసభల కార్యక్రమాలు కార్యనిర్వాహక వ్యవస్థకు పెద్ద అయిన ప్రధాని ఎలా ఆవిష్కరిస్తారని ప్రతిపక్ష పార్టీలు నిలదీస్తున్నాయి.
అటు జాతీయ చిహ్నం ఆవిష్కరణ సమయంలో పూజలు చేయడాన్ని తప్పుబడ్డాయి. ప్రధాని రాజ్యాంగ నియమాల్ని ఉల్లంఘించారంటూ విపక్షాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com