వ్యవసాయ, రైతు బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన

వ్యవసాయ, రైతు బిల్లులకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, త్రిణముల్ కాంగ్రెస్ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కవాతు నిర్వహించారు. సేవ్ ఫార్మర్స్, సేవ్ వర్కర్స్, సేవ్ డెమొక్రసీ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గులాంనబీ ఆజాద్, టీఆర్‌ఎస్ నుంచి కె.కేశవరావు, సమాజ్ వాదీ పార్టీ నుంచి జయాబచ్చన్, త్రిణముల్ కాంగ్రెస్ నుంచి డెరెక్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు తాము సభలో లేని సమయంలో కూలీలకు సంబంధించిన మూడు బిల్లులను పాస్ చేయొద్దని విపక్ష పార్టీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ రాశాయి. వ్యవసాయ, రైతు బిల్లులను ఎన్డీయే పార్లమెంట్‌లో పాస్ చేయడాన్ని నిరసిస్తూ నిన్న విపక్ష పార్టీలు పార్లమెంట్‌ను బాయ్‌కాట్ చేశాయి. ఈ బిల్లులకు సంబంధించిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com