Opposition Meeting: నేటి నుంచే విపక్షాల భేటీ- హాజరుకానున్న ఆప్‌

Opposition Meeting: నేటి నుంచే విపక్షాల భేటీ- హాజరుకానున్న ఆప్‌
బెంగుళూరు వేదికగా ఇవాళ్టి నుంచే ప్రతిపక్షాల సమావేశం... హాజరుకానున్న 24 పార్టీల నేతలు... తాము వస్తున్నామన్న ఆప్‌....

సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్న ప్రతిపక్షాలు... మరో కీలక భేటీకి సిద్ధమయ్యాయి. నేడు, రేపు బెంగళూరులో విపక్షాల రెండో భేటీ‍‌‍(Opposition Meeting) జరగనుంది. గత నెల 23న బిహార్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో 15 పార్టీలు పాల్గొన్న విషయం తెలిసిందే. బెంగళూరులో జరిగే ఇవాళ్టి సమావేశంలో పాల్గొననున్న విపక్ష పార్టీల సంఖ్య మరింత పెరిగింది. ఈ సమావేశానికి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మమతకు స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు.


తొలి సమావేశంలో పాల్గొనని ఆర్‌ఎల్‌డీRLD), ఎండీఎంకే(MDMK), కేడీఎంకే(KDMK), వీసీకే(VCK), ఆర్‌ఎస్‌పీ(RSP), ఫార్వర్డ్‌ బ్లాక్‌(FORWARD BLOCK), ఐయూఎంఎల్‌ (IUML), కేరళ కాంగ్రెస్‌ పార్టీలు బెంగళూరు భేటీకి హాజరవుతాయి. మొత్తం 24 విపక్ష పార్టీలు సమావేశానికి హాజరవుతాయి. కూటమికి ప్రత్యేక పేరును నిర్ణయించడంతో పాటు.. భవిష్యత్‌లో వివిధ రాష్ట్రాల్లో కలిసికట్టుగా ర్యాలీలు నిర్వహించే విషయంపై కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా విపక్ష పార్టీలకు చెందిన మొత్తం 80 మంది నాయకులు ఈ భేటీల్లో పాల్గొంటారు. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పాట్నాలో జరిగిన మొదటి సమవేశంలో 15 పార్టీలు పాల్గొన్నాయి.


ఈ భేటీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) కూడా హాజరుకానుంది. దేశ రాజధాని ఢిల్లీ(DELHI)లో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ (Delhi Ordinance)కు మద్దతు ఇవ్వబోమంటూ కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఆప్‌(AAP) స్వాగతించింది. కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం అనంతరం ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై కొన్ని రోజులుగా పోరాటం చేస్తోన్న ఆప్‌.. తమకు పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ మద్దతు తెలిపితేనే బెంగళూరు సమావేశానికి హాజరవుతామని గతంలో తేల్చి చెప్పింది.


2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ లో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు మద్దతు ఇవ్వబోమని కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఆప్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కోరుతూ కేజ్రీవాల్ మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, హేమంత్ సోరెన్ లతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలతో వ్యక్తిగతంగా సమావేశమై విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story