మా ఆడోళ్లు మద్యానికి బానిసలయ్యారు.. పోలీస్ స్టేషన్లో భర్తల కంప్లైంట్

మా ఆడోళ్లు మద్యానికి బానిసలయ్యారు.. పోలీస్ స్టేషన్లో భర్తల కంప్లైంట్
X
సంపాదించినదంతా తాగుడుకే ఖర్చుపెట్టి, ఇంటినీ, పిల్లల్నీ పట్టించుకోపోతే ఆ ఇల్లాలి మనోవేదన అంతా ఇంతా కాదు. కానీ ఆ ఇల్లాలే తాగుడుకు బానిస అయితే ఏం చెయ్యాలి అని తల పట్టుకుంటున్నారు. తమ మాట వినట్లేదని పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు ఆ భర్తలు.

సంపాదించినదంతా తాగుడుకే ఖర్చుపెట్టి ఇంటినీ, పిల్లల్నీ పట్టించుకోపోతే ఆ ఇల్లాలి మనోవేదన అంతా ఇంతా కాదు. కానీ ఆ ఇల్లాలే తాగుడుకు బానిస అయితే ఏం చెయ్యాలి అని తల పట్టుకుంటున్నారు. తమ మాట వినట్లేదని పోలీస్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు ఆ భర్తలు.

వినడానికే వింతగా ఉన్నా ఈ మధ్య ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ధూమపానం, మధ్యపానం సేవించడంలో పురుషులతో సమానంగా ఉంటున్నారు నేటి స్త్రీలు.

ఆరోగ్యానికి హానికరమని తెలిసినా అలవాటు మానలేకపోతున్నారు పురుషులు, స్త్రీలు ఇరువురు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితిలోని పుజారిపుట్ పంచాయతీ కొండగూడ గ్రామానికి చెందిన పలువురు పురుషులు తమ భార్యలు మద్యానికి బానిసలై తమను, తమ పిల్లలను పట్టించుకోవట్లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అబ్కారీ అధికారుల దృష్టికి కూడా తమ సమస్యను తీసుకువెళ్లారు.

గ్రామంలో కొందరు యువకులు సారా తయారు చేసి విక్రయిస్తున్నారని, అది చౌకగా లభించడంతో తమ ఇళ్లలోని ఆడవారు దాన్ని కొనుక్కుని తాగేస్తున్నారని, తాము కూలి చేసి సంపాదించిన డబ్బంతా తాగుడుకే ఖర్చుపెడుతున్నారని పురుషులు వాపోతున్నారు. ఫలితంగా తమ పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సారా తయారీ దారులను అడ్డుకోవాలని, సారా విక్రయాలను నిలిపివేయాలని కోరుతున్నారు. సారా తయారీదారులపై చర్యలు తీసుకుని తమ కుటుంబాలను రక్షించాలని పురుషులు అధికారులను వేడుకుంటున్నారు. పోలీసులు ఈ మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని చర్యలు చేపట్టారు.



Tags

Next Story