Pakistani Spies: పాక్ గూఢచర్యం వ్యవహారంలో ఏకంగా 14 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తాని గూఢచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చణీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ పాకిస్తాని గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణా దళం అరెస్ట్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ సైనిక ఉద్రిక్తతల తరువాత అనుమానిత పాకిస్తానీ గూఢచారుల పై ఖటిన చర్యలు తీసుకుంటున్న కేంద్రం ఉపక్రమించింది. పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై మూడు రాష్ట్రాల నుంచి మొత్తం14 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచారులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌కి చెందిన వారికిగా గుర్తించారు. గూఢచర్యానికి హబ్‌గా ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం మారడం మరో విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశంలో పట్టుబడిన పాకిస్తానీ గూఢచారులందరిలో, చాలా మందికి పాకిస్తాన్ రాయబార కార్యాలయంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాయబార కార్యాలయం పేరుతో భారత్‌లో ఒక గూఢచర్య హబ్‌ను పాక్ ఏర్పాటు చేసి, తన కార్యకాలాపాలు నిర్వహించసాగింది. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల తర్వాత భారతదేశంలో అరెస్టయిన గూఢచారులలో ఎక్కువ మంది న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాత గూఢచారులుగా మారినట్లు గుర్తించారు. పాకిస్తాన్ వీసా, పాకిస్తాన్ పౌరసత్వం, డబ్బు సులభంగా లభిస్తాయని హామీ ఇవ్వడంతో గూఢచర్యానికి నిందితులు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఐ నిఘా వర్గాలకు చేరవేసిన సమాచారం, ఉగ్రవాదులతో సంబంధాలు, నగదు లావాదేవీలు సహా పహల్గామ్ ఉగ్రదాడి కోణాల్లో గూఢచర్యానికి పాల్పడిన వారిని దర్యాప్తు సంస్థలు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com