300 Crores Seized In Odisha : లిక్కర్ కంపెనీల్లో నోట్ల కట్టలు కాదు కాదు గుట్టలు

ఒడిశాలో 300 కోట్లకుపైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. మద్యం తయారీ కంపెనీలు...... పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు...ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. బీరువాల్లో దాచి ఉంచిన వేలాది నోట్ల కట్టలను లెక్కించలేక............... యంత్రాలు సైతం మొరాయించాయి.
ఒడిశాలోని సంబల్‌పుర్ జిల్లాలో 300కోట్ల రూపాయలకుపైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు.పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా రెండు మద్యం కంపెనీలకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో బీరువాలో భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బును చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వీటిని బుధవారం లెక్కించడం ప్రారంభించగా ఇప్పటివరకు 50కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు. నగదు లెక్కించే యంత్రాలను నిరాటంకంగా నడిపడం వల్ల...అవి పనిచేయడం లేదని వివరించారు.
ఝార్ఖండ్ లోని పలు మద్యం కంపెనీల్లోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. పశ్చిమ ఒడిశాలో అతిపెద్దస్వదేశీ మద్యం తయారీ, విక్రయ కంపెనీల్లో ఒకటిగా ఉన్న బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన బలంగీర్ కార్యాలయంలో150 కోట్లకుపైగా నగదు దొరికింది. సంబల్ పుర్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా 150 కోట్లకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ సంస్థ బౌద్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కు వ్యాపార భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఒడిశాలోని బలంగీర్, సంబల్‌పుక్ జిల్లాలు, ఝార్ఖండ్ లోని రాంచీ లోహర్దగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం సుందర్‌గఢ్ మద్యం వ్యాపారి రాజ్‌కిషోర్ ప్రసాద్ జైస్వాల్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి. కోల్‌కతాలోనూ ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com