Pakistan: 22 మంది మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్తాన్

Pakistan: 22 మంది మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్తాన్
X
కరాచీ జైలులో శిక్ష పూర్తి , వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగింత

పాక్ జలాల్లో పట్టుబడిన 22 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరాచీలోని మాలిర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిని శుక్రవారమే విడుదల చేశారు. అయితే వారందరినీ పాక్ అధికారులు శనివారం రాత్రి వాఘా బార్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. గుజరాత్‌ తీర గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి.. అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. దీంతో పాకిస్తాన్ పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కోర్టులో హాజరుపరిచి, కరాచీలోని జైలుకు తరలించారు. అయితే కోర్టు విధించిన శిక్షను పూర్తి చేసుకున్న 22 మందిని కరాచీ జైలు అధికారులు విడుదల చేశారు.

గుజరాత్‌కు చెందిన 22 మందిని అట్టారీ-వాఘా సరిహద్దు వద్దకు తీసుకొని వచ్చి, లాంఛనాలు పూర్తి చేసుకున్న తర్వాత భారత్‌కు అప్పగించారు. ఇందులో కేంద్ర అధికారులులతో పాటు గుజరాత్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. కాగా మత్స్యకారుల విడుదల పట్ల వారి కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఏడాది జనవరి 1న ఇరు దేశాలు ఖైదీల జాబితాను పంచుకున్నాయి. దీని ప్రకారం పాకిస్తాన్ జైళ్లలో 266 మంది భారతీయులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇందులో 217 మంది మత్స్యకారులు, 49 మంది పౌరులు ఉన్నారు. ఇక భారత్ జైళ్లలో 462 మంది పాకిస్తానీయులు ఉండగా.. వీరిలో 381 పౌరులు, 81 మంది మత్స్యకారులు ఉన్నారు.

Tags

Next Story