Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి వరుసగా రెండో రోజు పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ సైన్యం ఎల్‌ఓసీ వెంబడి కాల్పులకు తెగబడింది. దీంతో భారత్ సైన్యం అప్రమత్తమై.. కాల్పులను తిప్పికొట్టింది. పాక్ సైన్యం కాల్పులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం కూడా పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. శనివారం కూడా అదే రీతిగా తెగబడడంతో ఆర్మీ తిప్పికొట్టింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాతపాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దును మూసేసింది. ఇలా ఒక్కొక్క దెబ్బకొడుతూ వెళ్తోంది. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఊహించని రీతిలో శిక్ష విధిస్తామని ఇప్పటికే ప్రధాని మోడీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల కొద్దీ గాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com