Modi : మోదీకి రాఖీ సిద్ధం చేస్తున్న పాకిస్తానీ మహిళలు

రక్షాబంధన్ కి ఇంకా కాస్త టైముంది కానీ అప్పుడే దేశంలో సందడి మొదలైంది. ముఖ్యంగా ప్రధాని మోదీకి రాఖీ పంపడానికి ఇద్దరు మహిళలకు సిద్ధం అవ్వటం ఈసారి ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు. ఒకరు గత 30 ఏళ్లుగా మోదీకి ప్రత్యేక రాఖీ కట్టే పాకిస్తాన్ సోదరి కాగా ఇంకొకరు మన దేశానికి వచ్చిన కొత్త కోడలు సీమా హైదర్.
రక్షా బంధన్ రోజు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన పాకిస్తాన్ సోదరి రాఖీ కట్టనున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీ రానున్నారని సమాచారం. పాకిస్థాన్‌కు చెందిన మహిళ ఖమర్ మొహసిన్ షేక్ తన వివాహం తర్వాత అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా ప్రధాని మోదీకి రాఖీ కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. కరోనా కారణంగా గత మూడేళ్లుగా రావడం లేదు కానీ సంప్రాదాయం ప్రకారం స్పీడ్ పోస్టులో ప్రధాని మోదీకి రాఖీ పంపించారు మెహసిన్ షేక్.
ఆయనకు పంపించే రాఖీ స్వయంగా ఆమె తన చేతులతో తయారు చేస్తారామె. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉండే తన అన్నకు వ్యవసాయానికి సంబంధించిన ఓ బుక్‌ను కూడా బహుకరించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఖమర్ మొహసిన్ షేక్, మోదీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు మొదటిసారి రాఖీ కట్టినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 30 ఏళ్లుగా ప్రతి ఏడాది రాఖీని కడుతూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి పబ్జీ ప్రియుడిని పెళ్లాడిన పాక్ మహిళ సీమా హైదర్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఆమె ప్రధాని నరేంద్రమోదీ సహా.. కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ CM యోగీఆదిత్యనాథ్‌కు రాఖీలు పంపింది.
దేశ బాధ్యత ఈ సోదరులపై ఉందంటూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. రాఖీలు సకాలంలో వారిని చేరేందుకు ఇన్ని రోజుల ముందు ఆమె వాటిని పంపించింది. అయితే దేశ రక్షణకు సంబంధించిన కేసు కాబట్టి కేంద్ర సంస్థలు సీమాపై ఓ కన్నేసి ఉంచాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పంద్రాగస్టు రోజున జాతీయ జెండా కూడా ఎగరవేసింది. ఇప్పుడు ఆగస్టు 30వ తేదీన రక్షాబంధన్ సందర్భంగా పోస్టు ద్వారా రాఖీలు పంపనున్నట్లు తెలిపింది. పోస్టల్ కవర్‌లో రాఖీతోపాటు కొన్ని స్వీట్లను కూడా ప్యాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ తీరుపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ కాగా, సోదరుడు కూడా పాక్ ఆర్మీలో సైనికుడని తెలిసింది. ఈ నేపథ్యంలో సీమా హైదర్‌ను పాకిస్థాన్ స్పైగా అనుమానిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com