రామ మందిర ప్రాణ్ ప్రతిష్ఠపై పాకిస్థాన్ స్పందన

బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్విగ్నంగా పూర్తిచేసిన అయోధ్య రామమందిర కార్యక్రమంపై పాకిస్థాన్ స్పందించింది. ఈ సంఘటనతో 'భారతీయ ముస్లింల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితి అట్టడుగుకు చేరుకుంది' అని పేర్కొంది.
దేశ ప్రజలతో పాటు, ప్రపంచంలోని భారతీయులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22, 2024న ముగిసింది, ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న రామమందిర ద్వారాలు ఇప్పుడు ప్రపంచం కోసం తెరవబడ్డాయి. భారీ ఎత్తున నిర్వహించన ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా పవిత్రోత్సవ వేడుకలు నిర్వహించబడ్డాయి.
ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ నుండి రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ వరకు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నేపాల్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా అనేక ఇతర దేశాలు భారతదేశంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో కూడా ఆలయాల్లో వేడుకలు నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అయితే పాకిస్తాన్ మాత్రం ప్రాణ ప్రతిష్ఠను ఖండించింది. ఈ వేడుక 'భారతీయ ముస్లింలను తక్కువ చేయడానికి' భారతదేశం చేస్తున్న ప్రయత్నమని పేర్కొంది. రామమందిర ప్రాణ ప్రతిష్ఠపై పాకిస్థాన్ వైఖరిని తెలుసుకోండి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com