SEEMA HAIDER: ఇక వెండితెరపై "పబ్జీ ప్రేమకథ”

పబ్జీ ప్రేమికుడిని కలిసేందుకు పాక్ నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన( illegal enter) సీమా హైదర్(Pakistan's Seema Haider) జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. సచిన్ మీనా, సీమా హైదర్(Seema Haider) కుటుంబాన్ని కలిసిన చిత్రబృందం(movie team) వారి కథపై సినిమా తీసే విషయమై చర్చలు జరిపింది. సినిమా(cinema)కు పేరును కూడా టీం ఖరారు చేసింది. మాజీ భర్తతో ఆమె ఎలా ఉండేది. సచిన్, సీమా ప్రేమ కథ ఎలా మొదలైందన్న నేపథ్యంలో సినిమా నిర్మాణం జరగనుంది.
ఈ చిత్ర నిర్మాత(producer) అమిత్ జానీ వివరాలను వెల్లడించారు. పబ్‌జీ గేమ్ ఆడుతుండగా ప్రేమకథ ఎలా మొదలైంది. ఆమె భారత్‌కు ఎలా వచ్చింది ? ఎందుకు వచ్చింది ? సీమా.. పాక్ ఏజెంటా? కాదా ? అనేది ప్రపంచానికి చెప్పాలని అనుకుంటున్నట్లు నిర్మాత వివరించారు. చిత్రానికి కరాచీ టు నోయిడా(karachi to noida) అనే పేరు ఖరారు చేశారు. ఆమె కరాచీ నుంచి నేపాల్ మీదుగా నలుగురు పిల్లలతో కలిసి నొయిడాకు వచ్చిందన్న అర్థంలో ఈ పేరు పెట్టారు. సీమా గురించి సమాచారం తెలుసుకోవడానికి ఆమె మాజీ భర్త గులాం హైదర్‌ను సంప్రదించాలని అనుకున్నామనీ గులాం భారత్‌కు రాకపోతే ఆయన ఉంటున్న సౌదీ అరేబియాకు రచయితను పంపిస్తామని నిర్మాత చెప్పారు. ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటనపై తెరకెక్కించనున్న ఏ టైలర్ మర్డర్ స్టోరీ సినిమాలో నటించాలని సీమాను చిత్రబృందం ఇప్పటికే సంప్రదించింది. ఆ చిత్రంలో రా ఏజెంట్ పాత్రలో సీమా నటించాలని కోరింది.
సీమాకు, భారత్‌కు చెందిన 22 ఏళ్ల సచిన్‌కు 2019లో పబ్జీ(PUBG) ఆడుతుండగా పరిచయమైంది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. దీంతో ఏడేళ్లలోపున్న తన నలుగురు పిల్లలను తీసుకుని దుబాయ్ మీదుగా నేపాల్.. అక్కడి నుంచి భారత్‌లోకి సీమా వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరూ గ్రేటర్ నొయిడాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. సచిన్ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయితే ఈ నెల 4వ తేదీన పోలీసులకు సమాచారం అందడంతో సచిన్, సీమాలను అరెస్టు చేశారు. తర్వాత వారిద్దరికీ బెయిలు లభించింది.
పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాలని లేదని, వెళితే తనని బతకనివ్వరని ,చంపేస్తారని భారతే తన ఇల్లని సీమా ఇప్పటికే ప్రకటించింది. ఆమె పిల్లలకు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, వారు ఆమెతోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. తన మొదటి భర్త గులామ్ 2020 నుండి తన నుంచి దూరంగా ఉన్నాడని సీమా పేర్కొంది.గులాం తనను మానసికంగా, శారీరకంగా హింసించేవాడని తెలిపింది. అతడి నుంచి విముక్తి దొరికినందుకు సంతోషంగా ఉందని వివరించింది. సచిన్‌పై తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచింది. ఇప్పుడు ఇతడే తన భర్త అని, ఇతనితో తాను చాలా సంతోషంగా ఉన్నానని సీమ తెలిపింది. పిల్లలు కూడా సచిన్‌ను తమ తండ్రిగా భావిస్తున్నారని ఆమె చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com