కంగారు పడకండి.. కావలసినంత టైముంది: 2వేల నోటు మార్పిడిపై RBI గవర్నర్

కంగారు పడకండి.. కావలసినంత టైముంది: 2వేల నోటు మార్పిడిపై RBI గవర్నర్
2వేల నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు కూడా, అంత పెద్ద నోటుకు చిల్లర ఇవ్వాలంటే దుకాణ దారులకు తల ప్రాణం తోక్కొచ్చేది.

2వేల నోట్లు చెలామణిలో ఉన్నప్పుడు కూడా, అంత పెద్ద నోటుకు చిల్లర ఇవ్వాలంటే దుకాణ దారులకు తల ప్రాణం తోక్కొచ్చేది. సరుకులు కొనపోయినా పర్లేదు అంత నోటుకు చిల్లర ఎక్కడ నుంచి తెచ్చేది అని విముఖత చూపేవారు.. ఇక ఇప్పుడు ప్రభుత్వం ఆ నోటును రద్దు చేయడం ఒకరకంగా మంచిదే..అయితే ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ప్రకటన వెలువడిందో అప్పటి నుంచి హడావిడి మొదలైంది.

తమ వద్ద ఉన్న నోట్లను మార్చేసుకోవాలని జనం బ్యాంకుల ముందు క్యూ కట్టేస్తున్నారు. ఇంత కంగారెందుకు పడుతున్నారు సెప్టెంబరు 30 వరకు గడువు ఉంది కదా.. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నందున నోటు మార్పిడి కోసం బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే అన్ని సమస్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సున్నితంగా వ్యవహరిస్తుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఏదైనా చెలామణి నుండి రూ.2వేల నోటును తొలగించాలనే ప్రక్రియ క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా ఉంది.

విదేశాల్లో ఉన్న వారికి గడువులోగా తమ వద్ద ఉన్న 2వేల నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. వీరిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 30 గడువును పొడిగించే అవకాశం ఉందని శక్తి కాంత్ దాస్ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. రూ. 2,000 నోట్లను ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కడా ఉపయోగించలేదని దాస్ చెప్పారు.

రూ. 2వేల నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని ఆర్‌బిఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయంపై లేవనెత్తిన ప్రశ్నలపై దాస్ స్పందిస్తూ.. ఎప్పుడు తీసుకున్నా ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయని అన్నారు.

రూ 2,000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసే ప్రక్రియ రేపు ప్రారంభమవుతుంది.

1. ₹ 2,000 నోట్ల మార్పిడికి ఎలాంటి ID ప్రూఫ్, రిక్విజిషన్ స్లిప్‌లు అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది .

2. ఒకేసారి గరిష్టంగా 10 నోట్లను మార్చుకోవచ్చు.

3. బ్యాంకు ఖాతాల్లో ₹ 50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్‌లకు ఆదాయపు పన్ను వర్తిస్తుంది.

4. వేసవిని దృష్టిలో ఉంచుకుని నోటు మార్పిడికి వచ్చిన వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని వివిధ బ్యాంకులను RBI కోరింది.

5. డిపాజిట్ లేదా మార్పిడికి సంబంధించిన రోజువారీ డేటాను నిర్వహించాలని బ్యాంకులను RBI కోరింది. రూ.50 వేల కంటే ఎక్కువ డిపాజిట్ చేసేవారు పాన్ నెంబర్ తప్పనిసరి అని దాస్ అన్నారు.

Tags

Next Story