Parliament Security Breach: పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ప్రధాని కీలక భేటీ

Parliament Security Breach: పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ప్రధాని కీలక భేటీ
8 మంది సిబ్బంది సస్పెన్షన్

పార్లమెంట్‌లో చెలరేగిన అలజడిపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లోక్‌సభలో కలకలం సృష్టించిన ఘటనపై పూర్తి వివరాలను ప్రధాని ఆరా తీశారు. దర్యాప్తు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. మరోవైపు బుధవారం ఘటనతో పార్లమెంట్‌లో ప్రవేశాలపై భద్రతా సిబ్బంది మరిన్ని ఆంక్షలు విధించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది సిబ్బందిపై వేటు పడింది.

దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటులో చెలరేగిన అలజడిపై ప్రధాని నరేంద్రమోదీ కీలక మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.క్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, మంత్రులు ప్రహ్లాద్‌ జోషీ, అనురాగ్‌ ఠాకూర్‌, పీయూష్‌ గోయల్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా సమావేశానికి హాజరయ్యారు. ఘటనకు గల కారణాలను.. భద్రతా వైఫల్యాలను మోదీ ఈ భేటీలో ఆరా తీసినట్లు తెలుస్తోంది. దర్యాప్తు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

లోక్‌సభలో బుధవారం ఇద్దరు ఆగంతకులు కలకలం రేపిన ఘటనతోఅప్రమత్తమైన భద్రతా దళాలు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశాయి. పార్లమెంట్ కు వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టదిట్టం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను రెట్టింపు చేసిన అధికారులు...లోక్ సభ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని... వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పార్లమెంట్ పాసులు ఉన్న వారికి మాత్రమే పరిసర ప్రాంతాల్లోకి వెళ్లే అవకాశం ఇస్తున్నారు. సందర్శకుల అనుమతిని స్పీకర్ ఇప్పటికే రద్దు చేశారు. కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశాలపై భద్రతా సిబ్బంది ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే మకర ద్వారం నుంచి ఇతరులకు ప్రవేశంపై నిషేధం విధించారు. మకర ద్వారం నుంచి ఎంపీలు మినహా ఎవరినీ అనుమతించడం లేదు. లోక్‌సభలో అలజడి ఘటన దృష్ట్యా మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. కేంద్ర మంత్రుల సెక్యూరిటీ సిబ్బందిని... మంత్రిత్వ శాఖ అధికారులను శార్దూల్‌ ద్వారం గుండానే లోపలికి అనుమతించారు. ముందస్తు పాసులు ఉన్న వారికి మాత్రమే పార్లమెంటులోకి అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని లోక్‌సభ భద్రతా సిబ్బంది తెలిపారు.


పార్లమెంట్‌ భద్రతా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎనిమిది మంది సిబ్బందిని లోక్‌సభ సెక్రటేరియట్‌ సస్పెండ్‌ చేసింది. ఇద్దరు వ్యక్తులు లోక్‌సభలోకి ప్రవేశించి కలకలం రేపిన ఘటన అనంతరం వీరిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సస్పెండ్ అయిన వారిలో రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు. సస్పెండ్ అయిన సిబ్బంది అందరూ..... పార్లమెంట్ భద్రత కోసం డిప్యుటేషన్‌పై వచ్చిన వారని అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story