Missing Parrot: చిలుకా క్షేమమా

Missing Parrot: చిలుకా క్షేమమా
తప్పిపోయిన చిలుకను తెచ్చిస్తే రూ. 10 వేల బహుమతి

కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. మనుషుల విషయంలో కంటే జంతువుల విషయం అది చాలా నిజం. అందుకే తాము ప్రేమగా పెంచుకున్నవి ఏవైనా కనిపించకపోయినా, వాటికి అనారోగ్యం వచ్చినా యజమానులు బాధపడిపోతారు. వాటి కోసం ఏమైనా చేస్తారు. అలా ఓ వ్యక్తి తన పెంపుడు చిలుక కనిపించటంలేదని దాన్ని తెచ్చిస్తే బహుమానం ఇస్తానని ప్రకటించాడు.

నా చిట్టి చిలుక తప్పిపోయింది. దాని ఆచూకీ చెప్పినా, పట్టుకు తెచ్చి ఇచ్చినా సరే రూ.10,000లు బహుమతిగా ఇస్తాను అంటూ ప్రకటించాడు ఓ వ్యక్తి. పోస్టర్ లు వేయించాడు. చుట్టుపక్కల పలు ప్రాంతాలకు తెలిసేలా ఆటోల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేయిస్తున్నాడు. కానీ పాపం ఆ చిలుక ఆచూకీ లభించలేదు. దీంతో అతనే కాదు అతని కుటుంబం కూడా ఎంతో దిగులుపడిపోతోంది.


మధ్యప్రదేశ్‌ లోని దమోహ్ జిల్లాకు చెందిన దీపక్ సోనీ అనే వ్యక్తి కుటుంబం ఓ రామచిలుకను పెంచుకుంటోంది. దానిని వారు కుటుంబంలో సభ్యులు గానే చూస్తారు. గత కొద్ది రోజులుగా ఆ చిలుక కనిపించకపోవటంతో కుటుంబం అంతా దిగులుపడిపోయింది. అప్పుడప్పుడు బయటకు వెళ్లినా ఎగిరి వచ్చేసేసింది. ఈసారి అది వెనక్కు రాలేదు.. రోజులు గడుస్తున్నా చిలుక ఇంటికి తిరిగిరాకపోవటంతో దీపక్ కుటుంబం ఆందోళన ఎక్కువ అయ్యింది. ఎక్కడెక్కడో వెదికారు కానీ ఫలితం లేకపోవడంతో, తమ చిలుక ఆచూకీ చెప్పినా..పట్టిచ్చినా రూ.10వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

ఈమధ్య చిలుక సరిగా ఎగరలేకపోతోందని, వీధి కుక్కలు దానికేమైనా హాని తలపెట్టాయేమోనని, అసలు అది బతికి ఉందో లేదో అంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చిలుకపై బెంగతో ఆహారం తినకుండా కుటుంబం అంతా దిగులుపడుతున్నారంటూ చెబుతున్నాడు. చిలుకని కనిపెట్టిన వారికి 10,000.. అవసరమైతే అంతకంటే ఎక్కువ బహుమతి ఇస్తాం అని చెబుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story