West Bengal : నాపై ఎవరో కుట్ర పన్నారు : పార్థ చటర్జీ

West Bengal : పశ్చిమ బెంగాల్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఈడీ అధికారులు... దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే అరెస్టైన విద్యాశాఖ మాజీ మంత్రి పార్థ చటర్జీతో పాటు స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.
కోల్‌కతా శివారులోని జోకాలో ఈఎస్‌ఐ ఆస్పత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పార్థ చటర్జీ....తన స్నేహితురాలు అర్పితా ముఖర్జీ ఇళ్లల్లో ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బు , బంగారం తనది కాదన్నారు. తనపై ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే సమాధానం చెబుతుందన్నారు. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఈ కుట్రలో తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించాడు పార్థచటర్జీ. ఇప్పుడు కూడా తనపై కుట్ర జరిగిందంటున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com