Air India : పైలట్ పంతం... పాసింజర్ల పడిగాపులు

Air India : పైలట్ పంతం... పాసింజర్ల పడిగాపులు
మరోసారి వార్తల్లో నిలిచిన ఎయిర్ ఇండియా

వాతావరణం అనుకూలించకపోవడంతో అత్యవసరంగా లాండ్ అయిన విమానాన్ని మళ్లీ నడిపేందుకు ఓ పైలట్ మొండికేసాడు. డ్యూటీ టైమ్ అయిపోయింది ఏం చేయలేను అంటూ చేతులెత్తేసాడు.. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్ లోనే పడికాపులు కాసారు.

భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లో నిలిచింది. లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండైంది. లండన్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ112 విమానం షెడ్యూల్ ప్రకారం ఢిల్లీలో దిగాల్సి ఉంది. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ పది నిమిషాల పాటు చెక్కర్లు కొట్టింది తర్వాత ఆ విమానాన్ని రాజస్థాన్ లోని జైపూర్ కు దారి మళ్ళించారు. జైపూర్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన రెండు గంటల తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. డ్యూటీ సమయ పరిమితులు, నిబంధనలు అందుకు అంగీకరించవన్నాడు. దీంతో అందులోని 350 మంది ప్రయాణికులు 5 గంటలపాటు ఎయిర్పోర్ట్ లో పడిగాపులు గాశారు. తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చేసేది లేక ప్రయాణికుల్లో కొందరిని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించగా, మొత్తం విమాన సిబ్బందిని మార్చిన తర్వాత అదే విమానంలో మిగతా వారిని ఢిల్లీ కి పంపించారు. అయితే ఈ విషయంపై ఎయిర్ ఇండియా స్పందించింది. పైలెట్ లకు కాకు పెట్టి తిప్పందికి ఉండే ఎఫ్ డి టి ఎల్ పరిమితులు పూర్తి అయిపోయాయని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటారనే పైలట్ మరియు క్రూ విమానం నడిపేందుకు అంగీకరించలేదు అన్నారు. ప్రతి పైలట్ కు కొన్ని నిర్దిష్టమైన ఫ్లయింగ్ అవర్స్ మాత్రమే ఉంటాయని, అవి దాటి వారు ప్రయాణించటం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలకు కట్టుబడి ఉండటం వలనే ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడిందని చెప్పారు. అయితే తాము తక్షణమే కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణికులను ఢిల్లీ కి చేర్చామన్నారు.

ఎయిర్ ఇండియా విమానాలు తరచుగా అనేక వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లోకెక్కుతున్నాయి. సుమారు 3 నెలల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఓ పైలట్‌ విమానంలోని కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని అనుమతించాడు. తరువాత విచారించిన అధికారులు ఇందుకు కారణమైన పైలట్ ల లైసెన్స్ ను కొంతకాలం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .

Tags

Read MoreRead Less
Next Story