Jambur: గుజరాత్‌లోని మినీ ఆఫ్రికా గ్రామంలో ఉత్సాహంగా పోలింగ్‌

Jambur: గుజరాత్‌లోని మినీ ఆఫ్రికా గ్రామంలో ఉత్సాహంగా పోలింగ్‌
X
తొలిసారి 7వ శతాబ్దంలో..

మినీ ఆఫ్రికా గ్రామంగా ప్రసిద్ధి చెందిన గుజరాత్‌ జునాఘడ్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని జంబుర్‌లో ఉత్సాహంగా పోలింగ్‌ జరిగింది. ఆఫ్రికా నుంచి భారత్‌కు వలస వచ్చిన వారు సిద్దీ తెగకు చెందిన ప్రజలు.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడంతో.. తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మూడో విడత ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఆ పోలింగ్‌లో జునాఘడ్‌ లోక్‌సభ స్థానంలోని జంబుర్‌ గ్రామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మినీ ఆఫ్రికా గ్రామంగా ప్రసిద్ధి చెందిన జంబుర్‌ గ్రామ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆఫ్రికా నుంచి వలస వచ్చినవారు........ ఇక్కడ ఉత్సాహంగా ఓటు వేశారు. ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు జంబుర్‌లో నివాసం ఉంటున్నారు.వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది.

2022లో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటుహక్కును కల్పించింది. మొత్తం 15 వందల మందికి ఇక్కడ ఓటు హక్కు ఉంది. ప్రత్యేకంగా వీరి కోసం అధికారులు ఓ పోలింగ్‌ బూత్‌ కూడా ఏర్పాటు చేశారు. తమ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ వీరు పోలింగ్‌బూత్‌లకు తరలివచ్చిఓటు హక్కు వేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని..అందరూ ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మినీఆఫ్రికన్‌ గ్రామాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీరి జనాభా 0.25 మిలియన్లు ఉండొచ్చని అంచనా ఉంది.

సిద్దీ తెగ ప్రజలు తొలిసారి 7వ శతాబ్దంలో భారత్‌లోఅడుగుపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అరబ్బుల దండయాత్రల సమయంలోనావికులు, కిరాయి సైనికులు, బానిసలుగా వీరిని భారత్‌కు తీసుకొచ్చారని చరిత్రకారులు చెబుతున్నారు.

అప్పటి నుంచి వారు భారత్‌లోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకొన్నారు. ఇక గుజరాత్‌కు మాత్రం జునాఘడ్‌ కోట నిర్మాణం నిమిత్తం ఆఫ్రికన్లను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. వీరంతా తొలుత రత్నపుర్‌ అనే గ్రామంలో ఉండేవారని ఆ తర్వాత క్రమంగా అందరూ జంబూర్‌లోకి వచ్చి స్థిరపడ్డారు. మూలాలు ఆఫ్రికాలో ఉన్నాగుజరాతీ, భారతీయ సంప్రదాయాలనే వీరు పాటిస్తున్నారు. వీరిని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంబుర్‌కు సందర్శకులు వస్తుంటారు

Tags

Next Story