మరోసారి పెరిగిన పెట్రోల్ ధర

X
By - Admin |28 Aug 2020 3:16 PM IST
చమురు ధరలు భగ్గుమంటున్నారు. గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరను చమురు సంస్థలు పెంచాయి.
చమురు ధరలు భగ్గుమంటున్నారు. గడచిన 13 రోజుల్లో 11 సార్లు పెట్రోల్ ధరను చమురు సంస్థలు పెంచాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోలు ధరలతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తాజాగా శుక్రవారం లీటరు పెట్రోల్‌పై 11 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.81.94కు చేరింది. 13 రోజుల్లో చమురు సంస్థలు లీటరు పెట్రోలుపై రూ.1.51 పైసలు పెంచాయి. అయితే డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర రూ.73.56పైసలుగా ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com