PF withdrawal From ATM: జూన్‌ నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా

PF withdrawal From ATM:  జూన్‌ నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్‌ విత్‌డ్రా
X
నిల్వను చూసుకునే అవకాశం కూడా

ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) శుభవార్త తెలిపింది. ఏటీఎం, యూనిఫైడ్‌ పేమె ంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వా రా డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగ ం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి సుమితా దావ్రా మాట్లాడుతూ ఈ ఏడాది మే లేదా జూన్‌ నెలాఖరు నుంచి యూపీఐ, ఏటీఎంల ద్వారా ఉద్యోగులు తమ పీఎఫ్‌ సొమ్మును నేరుగా విత్‌డ్రా చేసుకోవచ్చునని తెలిపారు. మన బ్యాంకు ఖాతాలో నుంచి తీసుకున్న మాదిరిగానే పీఎఫ్‌ ఖాతా నుంచి కూడా నేరుగా డబ్బులు ఏటీఎం కేంద్రాలతో పాటు గూగుల్‌ పే, ఫోన్‌పే లాంటి యూపీఐ యాప్‌ల ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. లక్ష రూపాయల వరకు వెంటనే విత్‌డ్రా లేదా తాము కోరుకున్న బ్యాంక్‌ ఖాతాలకు బదిలీ చేసుకోవచ్చునని సుమితా దవ్రా వివరించారు.

మే చివరి వారం నుంచి గానీ, జూన్‌ మొదటి వారం నుంచిగానీ ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల కార్యదర్శి సుమితా దావ్రా వెల్లడించారు. తొలుత రూ.లక్ష వరకు విత్‌ డ్రా చేసుకునే సౌకర్యం ఉందని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు. పీఎఫ్‌ ఖాతాలోని నిల్వను యూపీఐ ద్వారా చూసుకునే సౌకర్యం కూడా కల్పించినట్టు తెలిపారు. ఇళ్ల నిర్మాణం, విద్య, ఆరోగ్యం, వివాహం వంటి అవసరాల నిమిత్తం చాలా సులువుగా సొమ్మును విత్‌ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కలిగించినట్టు వివరించారు. దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే పీఎఫ్‌ ఖాతా నుంచి సొమ్ము విత్‌డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేయనున్నట్టు వివరించారు. 95శాతం క్లెయిమ్‌లు ఆటోమేటెడ్‌ విధానంలో జరుగుతున్నాయని చెప్పారు. పెన్షనర్లు కూడా ఏ బ్యాంకు నుంచయినా సొమ్ము తీసుకునే సౌకర్యాన్ని కలిగించినట్టు తెలిపారు.

Tags

Next Story