VIP Vehicle : ఇకపై వీఐపీలు వస్తుంటే భారతీయ సంగీతం

వీఐపీలు వస్తున్నారంటే చాలు భారీ సైరన్ మోగించుకుంటూ వాహనాలు వెళ్ళేవి. ఇప్పుడుఆ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఓ ముందు అడుగు వేశారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించి, సైరన్ సౌండ్ని పూర్తిగా రూపుమాపేలా వీఐపీ వాహనాలపై సైరన్‌లకు స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో వాయు కాలుష్యాన్ని అదుపు చేయడం చాలా ముఖ్యమైనదని, ఇందులో భాగంగా వీఐపీ వాహనాలపై ఉండే సైరన్లకు స్వస్తి చెప్పేందుకు కొత్త విధివిధినాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. సైరన్ మోతకు బదులుగా వినసంపైనవి ఉండేలా మార్పులు తీసుకు వస్తున్నామని తెలిపారు.
భారీగా ఉండే సైరన్ స్థానంలో భారతీయ సంగీత వాయిద్యాలైన ఫ్లూట్, వయోలిన్, తబలా, శంఖం వంటి సంగీత వాయిద్యాల ద్వారా రూపొందించిన శబ్దం వినపడేలా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. పుణెలోని చౌందినీచౌక్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయం వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com