Ahmedabad: పతంగుల పండుగలో సందడి చేసిన మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌

అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించిన నాయకులు

ప్రధాని మోడీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సందడి చేశారు. సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ గాలి పటాల ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు కలిసి గాలి పటాలు ఎగరవేశారు. తొలుత సమర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అటు తర్వాత గాలిపటాల పండుగను ప్రారంభించారు. ఇక వేదిక దగ్గర మోడీ, మోర్జ్ మహిళా కళాకారులతో సంభాషించారు. గాలి పటాల తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఉత్సవం జనవరి 14 వరకు కొనసాగనుంది.

ఇక ఆపరేషన్ సిందూర్‌కు గుర్తుగా ఒక గాలి పటాన్ని ఎగరవేశారు. ఇది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాంధీ ఆశ్రమం అని పిలువబడే సబర్మతి ఆశ్రమాన్ని 1917లో మహాత్మాగాంధీ స్థాపించారు. ఇది 1917 నుంచి 1930 వరకు గాంధీకి నిలయంగా ఉంది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఇద్దరి నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేయనున్నారు.

Tags

Next Story