Modi in Gujarat: అర్ధరాత్రి వేళ వారణాసిలో ప్రధాని

Modi in Gujarat:   అర్ధరాత్రి వేళ వారణాసిలో  ప్రధాని
రాత్రి 11 గంటలకు యూపీ సీఎం తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిపై

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. గుజరాత్‌లో బిజీబిజీగా గడిపిన అనంతరం ప్రధాని మోదీ నేరుగా వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి 11 గంటలకు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తో కలిసి శివపూర్-ఫుల్వారియా-లహర్తర రహదారిని పరిశీలించారు. ఇటీవలే ఈ రహదారుల ప్రారంభోత్సవం జరిగింది. విమానాశ్రయం, లక్నో, అజంగఢ్ మరియు ఘాజీపూర్ వైపు వెళ్లాలనుకునే BHU, BLW మొదలైన దక్షిణ భాగంలో నివసిస్తున్న సుమారు 5 లక్షల మంది ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ...గుజరాత్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. మెహసానా జిల్లాలో వాలినాథ్‌ మహాదేవ్‌ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగసభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. దేశంలో ఒకవైపు ఆలయాల నిర్మాణం మరోవైపు పేదల కోసం లక్షలాది గృహాల నిర్మాణం జరుగుతోందన్నారు. రాముని జన్మస్థానం అయోధ్యలో మహా ఆలయాన్నినిర్మిస్తే దేశప్రజలంతా సంతోషించగా నెగెటివితో జీవించే కొందరుమాత్రం విద్వేష మార్గాన్ని వీడటం లేదంటూ కాంగ్రెస్‌ పేరు ప్రస్తావించకుండా ఆ పార్టీకి చురకలు అంటించారు. అంతకుముందు గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌-GCMMF స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పశువుల పెంపకందారులు, రైతులుసహా లక్షమంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

అమూల్‌ బ్రాండ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల కంపెనీగా మార్చాలని పిలుపునిచ్చారు. అందుకు కేంద్రప్రభుత్వం అండగా ఉంటుందని, ఇది మోదీ గ్యారెంటీ అని ప్రధాని చెప్పారు. దేశంలో పాడి పరిశ్రమ మొత్తం టర్నోవర్‌ 10 లక్షల కోట్లు అని... వరి, గోధుమ, చెరకు ఉత్పత్తులు మొత్తం కలిపినా...అంతకాదని ప్రధాని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి తనను దూషించటం తప్ప మరో అజెండా లేదని నవ్‌సారిలో జరిగిన సభలో ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. తనపై కాంగ్రెస్‌ ఎంత ఎక్కువ బురద చల్లితే కమలం పార్టీ అంత ఎక్కువగా వికసిస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story