PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.

PM Modi:  ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. భూటాన్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద డ్రూక్‌ గ్యాల్పో’ను శుక్రవారం ఆయన అం దుకున్నారు. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధి నేతగా మోదీ నిలిచారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ చేతుల మీదుగా ప్రధాని ఈ అవార్డును అందుకున్నారు.

మన పొరుగుదేశం భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో( Order of the Druk Gyalpo)‘ను అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ ఇవాళ ప్రధాని మోదీని ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో సత్కరించారు. ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ..ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అభినందనలు తెలిపారు. కాగా,భూటాన్ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత ప్రధాని మోదీనే కావడం విశేషం. అయితే,ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు కరోనా విపత్కర సమయంలో 5 లక్షల వ్యాక్సిన్ లను అందజేయడం వంటి చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డుని మోదీకి భూటాన్ ప్రకటించింది.


రెండు రోజుల అధికార పర్యటనకు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం భూటాన్‌కు చేరుకున్నారు. అనివార్య కారణాలతో ఒకరోజు జాప్యం జరిగింది. భూటాన్ లో పర్యటించిన మోదీ..ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్‌ తోబ్గేతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, పర్యావరణం, పర్యటకం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై అవగాహన కుదుర్చుకున్నారు. ఈ పర్యటనలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ తిరుగు ప్రయాణమైన సందర్భంగా ఒక ట్వీట్ చేశారు.

“థాంక్యూ భూటాన్! ఇది చిరస్మరణీయమైన పర్యటన. ఈ అద్భుతమైన దేశ ప్రజల నుండి నేను పొందిన అభిమానాన్ని ఎప్పటికీ మరచిపోలేను. అక్కడ చేపట్టిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు తనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చాయన్నారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షికతను మెరుగుపరుస్తాయని భూటాన్ నుండి బయలుదేరే ముందు ప్రధాని మోడీ అన్నారు. అలాగే తిరుగు పయనమైన సమయంలో తనకు రెడ్ కార్పేట్ వేసి మరీ సాగనంపిన తీరు మనసును హత్తుకుందన్నారు. అక్కడి ప్రదేశాలు, వాతావరణం తనకు సరికొత్త అనుభూతిని కలిగించిందన్నారు”

భూటాన్ రెండు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశంలో అడుగు పెట్టిన ప్రధాని మోదీకి విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయంలో దిగన వెంటనే భూటాన్ లోని అనుభూతులను విదేశాంగ మంత్రితో చర్చించారు ప్రధాని మోదీ.

Tags

Read MoreRead Less
Next Story