PM Modi: పాట్నా గురుద్వారాలో ప్రధాని ‘లంగర్’ సేవ

స్వయంగా వండివార్చిన మోదీ

న్నికల ప్రచారంలో భాగంగా బిహార్ రాజధాని పాట్నాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ..అక్కడ ప్రఖ్యాతి చెందిన పాట్నా సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. సంప్రదాయ సిక్కు తలపాగా ధరించిన మోదీ...ఓ సాధారణ సేవకుడిలా మారిపోయి గురుద్వారా లో పనిచేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సాహిబ్ గురుద్వార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లంగర్‌లో తాను వండిన ఆహారాన్ని భక్తులకు వడ్డించారు. మోడీ ఆహారాన్ని వడ్డిస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో ప్రధాని మోదీ తలపాగా వేషధారణలో స్టీల్ బకెట్ పట్టుకుని ఆహారాన్ని అక్కడి వారికి వడ్డించడం కనిపించింది. అంతేకాదు.. ఆయనే స్వయంగా రోటీ కూడా తయారుచేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. తఖత్ పాట్నా సాహిబ్, తఖత్ హరిమందిర్ జీ.. పాట్నా సాహిబ్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర రాజధానిలో ఉన్న సిక్కుల ఐదు తఖత్‌లలో ఇదొకటి. గురుగోవింద్ సింగ్ జన్మస్థలం గుర్తుగా 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ ఈ తఖత్ నిర్మించారు. రాష్ట్ర రాజధానిలో రోడ్‌షో నిర్వహించిన ఒక రోజు తర్వాత ప్రధాని మోదీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్‌ను సందర్శించారు.

బీహార్‌లో రోడ్‌షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీనే. సోమవారం హాజీపూర్, ముజఫర్‌పూర్, సరన్‌లలో ఎన్‌డీఎ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ర్యాలీలలో ప్రధాని ప్రసంగించనున్నారు. లోక్‌సభ ఎన్నికల 4వ దశ పోలింగ్‌ సందర్భంగా మోదీ ఈరోజు ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల పోలింగ్‌లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేయాలని కోరారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ కీలకమైన రాష్ట్రం. ఒక్కడ 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రం.. లోక్‌సభ స్థానాలకు అతి పెద్దదిగా ఉంది. ఇక్కడ బీజేపీ, జేడీయూ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే4 విడతల పోలింగ్ ముగిసింది. మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.

Tags

Next Story