Narendra Modi : స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని మోదీ..

Narendra Modi : స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని మోదీ..
నీటిలో మునిగి ద్వారకా నగరంలో ప్రార్థనలు..!

ఈ ఏడాది లక్షదీప్ పర్యటనలో స్కూబా డైవింగ్ చేసిన ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో మరోసారి డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని విశ్వసించే ప్రదేశంలో ప్రార్థనలు చేశారు. స్కూబా డైవింగ్‌కు సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేసిన ప్రధాని తన అనుభూతిని పంచుకున్నారు.

గుజరాత్‌ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ డేరింగ్ స్టంట్ చేశారు. లోతైన సముద్రంలోకి దూకి ద్వారకా నగరం మునిగిపోయిందని భావించే చోట పూజలు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా ఎక్స్ వేదికగా తెలిపారు. స్కూబా డైవింగ్‌కు సంబంధించిన చిత్రాలను జతచేశారు. సాహసోపేతమైన స్టంట్‌ కోసం స్కూబా గేర్ ధరించిన ప్రధాని పలువురు డైవర్ల సాయంతో లోపలికి వెళ్లారు. నెమలి ఈకలను వెంటతీసుకెళ్లి పురాతన ద్వారకా నగరానికి నివాళులర్పించారు.


నీటిలో ద్వారకా నగరం ఉన్న ప్రదేశంలో ప్రార్థన చేయడం దివ్యమైన అనుభూతినిచ్చిందని ప్రధాని ఎక్స్‌లో పేర్కొన్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందినట్టు చెప్పారు. శ్రీ కృష్ణ భగవానుడు అందరినీ ఆశీర్వదిస్తారని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

భారత్‌లోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారక ఒకటిగా సంప్రదాయం చెబుతోంది. పశ్చిమ సముద్రతీరంలో సౌరాష్ట్ర....నేటి గుజరాత్‌లో ద్వారకా పట్టణం ఉంది. ద్వారకలో నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలుండేవి. వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాల్లో ఇది ఒకటి.జరాసంధుడు అనే రాక్షసుడి దాడుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలన్న శ్రీకృష్ణుడి కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.శతాబ్దాల క్రితం శ్రీ కృష్ణుడు భూమి నుంచి నిష్క్రమించిన తర్వాత ఈ నగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువులు విశ్వసిస్తారు

Tags

Read MoreRead Less
Next Story