గ్రామీ విజేత తో కలిసి పాట రాసిన ప్రధాని

గ్రామీ విజేత తో కలిసి పాట రాసిన ప్రధాని
తృణధాన్యాల ప్రయోజనాలే సాహిత్యం

మోదీ ఏదీ చేసినా వింతగానే ఉంటుంది. ప్రచారానికి, వివాదాలకు రెండింటికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు మోదీ మరో పని చేసి అందరి ద్రుష్టి ఆకర్షించారు. గ్రామీ అవార్డు విజేత ఫాలు, ఆమె భర్తతో కలిసి తృణధాన్యాలపై ప్రచారం కోసం ఓ పాట రాసారు.మిల్లెట్స్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ఇండో అమెరికన్ గాయని ఫాలు తన భర్తతో కలిసి ఒక పాటను రూపొందించారు. ఈ పాటకు భారత ప్రధాని నరేంద్ర మోడీ తన కలం కలిపారు. పాట మధ్యలో తన గాత్రాన్ని అందించారు. అబెండెన్స్ ఇన్ మిల్లెట్స్ పేరుతో ఫాలు, ఆమె భర్త ఈ పాటను ఈరోజు విడుదల చేశారు. చాలా సున్నితమైన, వినసొంపైన మ్యూజిక్ తో ఇంగ్లీష్ మరియు హిందీలో ఉన్న ఈ పాట మధ్యలో మోదీ మాటలు వినిపిస్తాయి.

తృణధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సమస్యను ఎలా నిర్మూలించొచ్చు అన్నది ఈ పాట ఉద్దేశం. ముంబైలో పుట్టి అమెరికాలో పెరిగిన ఫాలు 2022లో ప్రత్యేక గ్రామ అవార్డు గెలుచుకున్నారు. ఆ సందర్భంగా ఢిల్లీ వచ్చినప్పుడు మోడీని కలిశారు. అప్పుడే మోడీ తృణ ధాన్యాలపై ఒక ప్రత్యేక గీతాన్ని రచించాలన్న సలహా ఇచ్చారని, అయితే రచించే సమయంలో మోదీ కూడా తమతో కలిసి పాట రాయడానికి పూనుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.భారత ప్రతిపాదన మేరకు ఈ ఏడాదిని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ రుణ ధాన్యాలు సంవత్సరంగా ప్రకటించింది. ఇప్పటికే 130 దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తున్నారు. ఆసియా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది వీటిని సాంప్రదాయ ఆహారంగా పరిగణిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story