PM Modi: చెస్ ప్రజ్ఞకు ప్రధాని మోదీ ఆప్యాయ పలకరింపు

చెస్ ప్రపంచ కప్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానందను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. మోడీ పిలుపు మేరకు ప్రజ్ఞా, అతని తల్లిదండ్రులను ప్రధాని ఆయన నివాసానికి వెళ్లారు. ఏ సందర్భంగా చెస్ మేధావిని అభినందించిన ప్రధాని అతని తల్లిదండ్రులతో అప్యాయంగా మాట్లాడారు. వారితో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఇంటికి విశిష్ఠ అతిథులు వచ్చారని పేర్కొన్నారు. ‘ప్రజ్ఞానందను అతని కుటుంబంతో సహా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. పట్టుదల, తపనకు నిదర్శనం ప్రజ్ఞానంద. నిన్ను చూసి గర్విస్తున్నా’ అని పేర్కొన్నారు.
ప్రతిభావంతులైన యువ ఆటగాడు ప్రజ్ఞానంద ఇటీవల చెస్ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకున్నాడు. టైటిల్ మ్యాచ్‌లో కూడా ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చివరికి ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలువల్సివచ్చింది. ప్రజ్ఞానంద అంతకుముందు కార్ల్‌సెన్‌ను ఓడించాడు, కానీ ఫైనల్‌లో ఆ ఫీట్‌ను పునరావృతం చేయలేకపోయాడు. అయినా సరే.. తన ప్రతిభతో కోట్లాది మంది భారతీయుల మనస్సును గెలుచుకున్నారుడు ఈ యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.
మరోవైపు ప్రజ్ఞానందపై ప్రశంసలతో పాటు , ప్రోత్సాహకాల వర్షం కూడా కురుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రోత్సాహక బహుమతి కింద రూ. 30 లక్షల నజరానా అందించారు. ఇక వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా అతని తల్లిదండ్రులకు ఎక్స్ యూవీ 400 ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ప్రకటించారు. ఈ ప్రత్యేక బహుమతిపై యంగ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్పందిస్తూ..ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. కృతజ్ఞతలు తెలియజేయడానికి తనకి మాటలు కూడా రావటం లేదాని, EV కారు కొనడం నా తల్లిదండ్రుల చిరకాల కల, ఆ కలను నిజం చేసినందుకు ఆనంద్ మహీంద్రా సర్కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రజ్ఞానంద ట్వీట్ కు ఆనంద్ మహీంద్రా ప్రతిస్పందనగా కార్ల తయారీదారు యొక్క అంతిమ లక్ష్యం ..కస్టమర్ల కలలను నేరవేర్చడమే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com