Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని వాజ్‌పేయికి నివాళులర్పించిన ప్రముఖులు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. అటల్ బిహారి వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజయ్‌ఘాట్ ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి ధన్‌కర్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు బీజేపీ ప్రముఖులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.బీజేపీ సీనియర్ నేత,మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్ సమీపంలో నిర్మించిన సదైవ్ అటల్‌ను సందర్శించి నివాళులర్పించారు.
అలాగే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, అనురాగ్ ఠాకూర్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వంటి ప్రముఖులు వాజ్‌పేయికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రముఖులందరూ సంగీత విభావరిలో పాల్గొన్నారు. కాగా.. మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వాజ్‌పేయి జీవితంలోని వివిధ ఘట్టాల సమాహారంగా ఉన్న వీడియోను మోదీ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియోకు మోదీ వాయిస్ అందించారు. ‘దేనిలోనైనా హాస్యాన్ని వెతకగల సామర్థ్యం వాజ్‌పేయి సొంతమని తన గళంతో మోదీ వెల్లడించారు. పార్టీ సమావేశాల్లో వాతావారణం వేడెక్కుతున్న సమయంలో కూడా జోక్ వేసి గంభీరమైన వాతావరణాన్ని కూడా నవ్వులు పూయించగల గొప్ప నేత అన్నారు. ఆయనకు ప్రతి విషయంపై అవగాహన ఉండేది’ అని మోదీ ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com