PM Modi: 13న జమ్మూకాశ్మీర్‌లో మోడీ పర్యటన..

ప్రధాని మోడీ సోమవారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. సోన్‌మార్గ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. రూ.2.700 కోట్లతో చేపట్టిన ‘జడ్ మోడ్’ టన్నెల్ ప్రాజెక్ట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించి ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ప్రధాని మోడీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ పోస్టుపై ప్రధాని మోడీ స్పందించి.. టన్నెల్ ప్రారంభోత్సవానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోడీ రీట్వీట్ చేశారు. టన్నెల్ అందుబాటులోకి వస్తే పర్యాటకం, స్థానికంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలను చక్కగా వివరించారని సీఎం ఒమర్ అబ్దుల్లాను అభినందించారు. టన్నెల్ ఫొటోలు, వీడియాలు చాలా బాగున్నాయని ప్రశంసించారు.
రూ.2,700 కోట్లతో సోన్‌మార్గ్ టన్నెల్ నిర్మించారు. ఈ సొరంగం 12 కిలోమీటర్లు ఉంటుంది. ఎగరెస్ టన్నెల్, అప్రోచ్ రోడ్లు ఉన్నాయి. 8,650 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీనగర్-సోన్‌మార్గ్ మధ్య కనెక్టివిటీని అందిస్తుంది. కొండచరియలు, హిమపాతాలు సంభవించినప్పుడు లేహ్‌కు ఇది సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com