Telangana Elections 2023: ప్రధాని పర్యటనలో భద్రత లోపం ఘటన..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 5న పంజాబ్ లో జరిపిన పర్యటనలో భద్రతా లోపం పై బడిండా ఎస్‌పీ గుర్వీందర్ సింగ్ సంఘాను సస్పెండ్ చేశారు. పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ శనివారంనాడు ఈ విషయం తెలిపింది. ఫెరోజ్‌పూర్‌లో ఎస్‌పీ ఆపరేషన్స్ కోసం నియమించిన గుర్విందర్ సింగ్ విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.
గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వెళ్లినప్పుడు భద్రతా లోపం తలెత్తింది. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన వెళ్తున్న మార్గంలోనే ఉన్నట్టుండి పెద్ద ఎత్తున రైతులు వచ్చి ఆందోళన చేపట్టారు. ఫలితంగా ఓ ఫ్లైఓవర్‌పైనే ప్రధాని మోదీ కాన్వాయ్ 20 నిముషాల పాటు నిలిచిపోయింది. ప్రధాని స్థాయి వ్యక్తి వస్తే భద్రత కల్పించకుండా ఏం చేస్తున్నారంటూ పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా మండి పడ్డారు. గతేడాది జనవరి 5వ తేదీన జరిగిందీ ఘటన. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ తిరిగి వస్తుండగా ఈ సమస్య ఎదురైంది. అప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతోంది. ఈ భద్రతా లోపానికి కారణమైన ఏడుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. వీళ్లలో ఫెరోజ్‌పూర్ ఎస్‌పీతో పాటు ఇద్దరు DSP ర్యాంక్ ఆఫీసర్‌లూ ఉన్నారు. ప్రధాని మోదీ చివరి నిముషంలో షెడ్యూల్ మార్చారని, అందుకే భద్రత కల్పించలేకపోయమాని అప్పట్లో ప్రభుత్వం వివరణ ఇచ్చినా వివాదం సద్దుమణగలేదు. సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలోని పోలీసు అధికారులే ఈ భద్రతా లోపానికి కారణమని తేల్చి చెప్పింది ఈ కమిటీ. ఈ ఆదేశాల మేరకు ప్రస్తుత ఆప్ ప్రభుత్వం ఆ 7గురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఫెరోజ్‌పూర్ పోలీస్ చీఫ్, బఠిండా ఎస్‌పీ గురుబీందర్ సింగ్ ఈ సస్పెన్షన్‌కి గురైన వాళ్లలో ఉన్నారు. మొదటి నుంచి ఆయనపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయనతో పాటు మరో 6గురినీ బాధ్యులుగా తేల్చింది కమిటీ. డీఎస్‌పీ ర్యాంక్ అధికారులు పర్సోన్ సింగ్, జగ్దీశ్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు జతీందర్ సింగ్, బల్వీందర్ సింగ్, SI జస్వంత్ సింగ్, అసిస్టెంట్ SI రమేశ్ కుమార్..సస్పెన్షన్‌కి గురయ్యారు. Punjab Civil Services Rulesలోని రూల్ 8 ప్రకారం వీళ్లందరిపైనా చర్యలు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com