PM Narendra Modi: ఆర్టికల్ 370పై తప్పుదోవ పట్టించారు: మోడీ

జమ్ముకశ్మీర్‌లో అధికరణ 370రద్దు తర్వాత అనేక ఆంక్షల నుంచి స్వేచ్ఛ లభించిందనిప్రధాని మోదీ తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రులు అధికారణ 370 పేరుతో జమ్ముకశ్మీర్ ప్రజలతోపాటు దేశాన్ని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. వివిధ రంగాలకు సంబంధించి వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు.
2019లో 370అధికరణ రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో నూతన శిఖరాలను తాకటంతోపాటు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని మోదీ 5వేల కోట్ల వ్యయంతో వ్యవసాయ రంగం పుంజుకువటానికి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. శ్రీనగర్‌లోని హజ్రత్‌బల్ దర్గా సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుతోపాటు స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద పర్యాటకరంగంలో 1400 కోట్ల వ్యయంతో చేపట్టిన...అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. ఛాలెంజ్ ఆధారిత గమ్యస్థానాల అభివృద్ధి పథకంలో భాగంగా...ఎంపిక చేసిన పర్యాటక కేంద్రాలను ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం శ్రీనగర్ బక్షీ స్టేడియంలో...వికసిత్ భారత్-వికసిత్ జమ్ముకశ్మీర్ పేరుతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ...పాల్గొన్నారు. జాతికి అంకితం చేసిన అభివృద్ధి ప్రాజెక్టులతో జమ్ముకశ్మీర్ అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్నారు. వికసిత భారత్‌కు...వికసిత జమ్ము కశ్మీర్ ప్రాధాన్యాంశమని ప్రధాని మోదీ తెలిపారు. పర్యాటక అవకాశాలు, రైతుల సాధికారత ద్వారానే...జమ్ముకశ్మీర్ అభివృద్ధి నిర్మాణానికి మార్గం ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ అధికరణ 370పై చాలాకాలంపాటు జమ్ముకశ్మీర్ ప్రజలనే కాకుండా దేశాన్ని కూడా తప్పుదారి పట్టించిందని ప్రధాని మోదీ ఆరోపించారు.
జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వెయ్యి మందికి ప్రధాని నరేంద్ర మోదీ నియామక పత్రాలు ప్రదానం చేశారు. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలుసహా... కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో ప్రధాని ముఖాముఖి నిర్వహించారు.
ఇండియా గ్లోబల్ డయాస్పోరా ప్రచారాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రవాస భారతీయులు...అపూర్వ భారత్ అంబాసిడర్‌లుగా మారి, దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com