PM Modi : జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని

PM Modi : జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని
అనేక ప్రాజెక్టులు జాతికి అంకితం

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మంగళవారం 30,500 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.దేశంలో మూడు ఐఐఎం క్యాంపస్‌లను ప్రారంభిస్తారు. అందులో ఐఐఎం జమ్ము, బోధ్‌ గయా, విశాఖపట్నం క్యాంపస్‌లు ఉన్నాయి.

ఇదే సమయంలో ఐఐటీ బిలాయ్‌, ఐఐటీ తిరుపతి, ఐఐటీ జమ్ము, ట్రిపుల్‌ ఐటీ కాంచీపురం శాశ్వత భవనాలను కూడా జాతికి అంకితం చేస్తారు. కాన్‌పుర్‌లో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ స్కిల్స్‌-IISను కూడా ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆధునికీకరించిన 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 నవోదయ విద్యాలయ భవనాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మరికొన్ని కేంద్రీయ విద్యాలయాల భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంంబధించి విశాఖపట్నంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ -IIM శాశ్వత భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనుండగా 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను సిద్ధం చేశారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. జగన్నాథగట్టు వద్ద క్యాంపస్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 296 కోట్ల రూపాయలు ఇచ్చింది. తాజాగా మరో 50 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మరిన్ని పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడే అవకాశముంది. ఇటు ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో డెవలెప్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో ఐదువేల మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతి గృహాలు సహా అన్నిరకాల వసతులు సమకూర్చారు. మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలోవివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 30వేల 500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వివరించింది. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ఈనెల 25న ప్రధాని జాతికి అంకింతం చేయనున్నారు. అదేరోజు రాజ్ కోట్, బటిండా, రాయ్‌బరేలి, కళ్యాణి ఎయిమ్స్ లను మోదీ ప్రారంభిస్తారు. విశాఖలో నిర్మించిన మైక్రో బయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ , పీఎం-అభిమ్ పథకం కింద నిర్మించిన తొమ్మిది క్రిటికల్ కేర్ బ్లాకులను అదే రోజు ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story