Kargil Vijay Diwas: కార్గిల్ అమరవీరులకు ప్రధాని నివాళి.

25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్గిల్‌లోపర్యటించనున్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర అమరవీరులకు నివాళులర్పించనున్నారు. నేటి ఉదయం 9:20 గంటలకు కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు మోడీ నివాళులర్పిస్తారు. అంతేకాకుండా షింకు లా టన్నెల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు.
అయితే, ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ఇలా రాసుకొచ్చారు.. జూలై 26వ తేదీ ప్రతి భారతీయుడికి చాలా ప్రత్యేకమైన రో.. 25వ కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటాం.. మన దేశాన్ని రక్షించే వారందరికీ నివాళులు అర్పించే రోజు.. నేను కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి మన వీర వీరులకు నివాళులర్పించడంతో పాటు షింకు లా టన్నెల్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయబోతున్నాను.. ప్రతికూల వాతావరణంలో లేహ్‌కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సొరంగం అనేక విధాలుగా ముఖ్యమైనదన్నారు. ఈ సొరంగం సరిహద్దుకు సరఫరాలను అందించడానికి వినియోగించబడుతుందన్నారు.
కాగా, ప్రస్తుతం, లేహ్ లడఖ్ కోసం మొదట పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతానికి ఆనుకుని ఉన్న జోజిలా పాస్, రెండవది చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బరాలాచా సొంరంగాలు ఉన్నాయి. అయితే, షింకు టన్నెల్ ప్రాజెక్ట్ హిమాచల్ నుంచి నెమో- పదమ్- దర్చా రహదారిపై 15,800 అడుగుల ఎత్తులో నిర్మించబడుతుంది.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా నిలవబోతుంది. 2025 నాటికి పూర్తికానున్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ పొడవు 4.1 కిలోమీటర్లు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి నీమో- పదమ్- దర్చా రహదారి కేవలం 298 కిలో మీటర్లు.. మనాలి- లేహ్ రోడ్ 428 శ్రీనగర్- లేహ్ దూరం 439 కిలోమీటర్లు కాబట్టి.. ఇది లేహ్ చేరుకోవడానికి అతి తక్కువ మార్గంగా ఉండనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com