Lok Sabha Polls: ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం..

Lok Sabha Polls: ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం..
రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని ఓటర్లకు మోదీ పిలుపు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది. 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో 97 అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కీలక సందేశాన్నిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రజలను కోరారు. యువత, తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఓటర్లకు సందేశాన్ని పంపారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేసే ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ మరియు అస్సామీ భాషల్లో ఎక్స్ వేదికగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ముఖ్యమైనదని అన్నారు.

‘‘ 2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభమవనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాల్లో ఓటు హక్కు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటర్లు ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ఎంతైనా ప్రతి ఓటు విలువైనదే. ప్రతి గొంతు ముఖ్యమైనదే!’’ అని ట్వీట్‌లో మోదీ పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ తో పాటు సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయాలని నిర్ణయించుకున్న 85 సంవత్సరాల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఎన్నికల సంఘం సక్షం యాప్ ద్వారా పిడబ్ల్యుడి ఓటరు వీల్ చైర్ సౌకర్యాలు కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇవాళ 16.63 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 102 స్థానాల్లో మొత్తం 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. 1,625 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు.

ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను కఠినంగా నియంత్రించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటోందగి. 24 గంటలూ బృందాలతో నిఘా ఉంచింది. 1374 అంతర్ రాష్ట్ర, 162 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. 102 లోకసభా నియోజకవర్గాల పరిధిలో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story