ప్రజా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యం

ప్రజా ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా భారత్, అమెరికా పని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని చెప్పారు. అమెరికాలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు, 4 మిలియన్ల భారతీయ అమెరికన్లకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి తిరిగి వైట్‌హౌస్‌కు చేరుకున్న మోదీకి.. అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. మోదీకి గౌరవ సూచకంగా సైనికులు 19 రౌండ్‌లు గాల్లోకి కాల్పులు జరిపారు.
అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. వైట్‌హౌస్‌లో అమెరికా అధినేత బైడెన్‌తో భేటీ అయిన మోదీ పలు అంశాలపై చర్చించారు. అనంతరం ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు.
భారత్, అమెరికా మధ్య బంధం చాలా గొప్పదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఇరుదేశాల మధ్య సారూప్య విలువలు ఉన్నట్లు చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యేక బంధం ఏర్పడిందన్నారు. రెండు గొప్ప దేశాలు, రెండు గొప్ప శక్తులు అని అన్నారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా భారత్-అమెరికా కలిసి పని చేయడం చాలా అవసరమన్నారు. పేదరిక నిర్మూలన, వాతావరణ మార్పులను పరిష్కరించడం, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత తదితర అంశాల్లో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయని గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com