PM Modi: ముస్లింలకు ప్రధాని ఈద్ శుభాకాంక్షలు

ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలగాలని ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సోమవారం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఒకరినొకరు ఒకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఇది ముస్లింలకు ప్రత్యేకమైన రోజు. ఆదివారం దేశంలో ఈద్ చంద్రుడు కనిపించాడు. దీంతో సోమవారం ఈద్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ.. సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో తెలియజేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com